Corona Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,788 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,71,773కి చేరింది. నిన్న కొత్తగా 14,457 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,02,11,342 కోలుకున్నారు. కాగా, బుధవారం ఒక్కరోజే 145 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,52,419కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,08,012 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqwfbRz @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/cKegXDFcsX
— ICMR (@ICMRDELHI) January 18, 2021