Watch Video: వందేభారత్‌లో ‘వందేమాతరం’.. కుర్రాడి ఫ్లూట్‌ ట్యాలెంట్‌కు ప్రయాణికులు ఫిదా..

|

Nov 12, 2022 | 5:39 PM

దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై-మైసూర్ రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్‌ 11వ తేదీన బెంగళూరులో ప్రధాని ఈ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే..

Watch Video: వందేభారత్‌లో వందేమాతరం.. కుర్రాడి ఫ్లూట్‌ ట్యాలెంట్‌కు ప్రయాణికులు ఫిదా..
Vande Bharat Express
Follow us on

దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై-మైసూర్ రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్‌ 11వ తేదీన బెంగళూరులో ప్రధాని ఈ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రైలులో చోటు చేసుకున్న ఓ సంఘటన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ విద్యార్థి ఫ్లూట్‌పై వందేమాతం గేయాన్ని అద్భుతంగా ఆలపించిన తీరు నెటిజన్లను ఫిదా చేస్తోంది.

ఓ రైల్వే ఉద్యోగి ఈ వీడియోను షేర్‌ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బెంగళూరుకు చెందిన అప్రమేయ శేషాద్రి అనే 12వ తరగతి విద్యార్థి వందేమాతరం గేయాన్ని వేణువుపై అద్భుతంగా పలికించాడంటూ ఆ వీడియోను షేర్‌ చేశాడు. కుర్రాడి ట్యాలెంట్‌కు తోటి ప్రయాణికులు ఫిదా అయ్యారు. ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీసి పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వందే భారత్‌ ట్రైన్‌ లో వందేమాతరం గీతాన్ని ఫ్లూట్ పై ఇలా ఆలపించడం ప్రత్యేక సందర్భంగా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..