Snake: హోటల్ కిటికీ వద్ద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ భారీ పాము హల్‌చల్ చేసింది. 12 అడుగుల పొడవైన భారీ పాము చూసి.. స్థానికులు, హోటల్ సిబ్బందిలో భయాందోళనలకు గురయ్యారు. హోటల్ ఏసీ యూనిట్ నుండి కారుతున్న నీటి బిందువులను తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆ భారీ సర్పం కిటికీ రెయిలింగ్‌లో చిక్కుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Snake: హోటల్ కిటికీ వద్ద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా
Huge Snake

Updated on: Apr 14, 2025 | 7:33 PM

అది ఒడిశాలోని గంజాం జిల్లా. చికిటి నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్‌ఐసి)కి సమీపంలోని నీలియా బంద్‌లో గల ఒక హోటల్ సమీపంలో 12 అడుగుల పొడవైన పాము కనిపించడంతో ఆదివారం రాత్రి కలకలం చెలరేగింది. పాము సైజు, పొడవు చూసి స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మొదట్లో దీనిని కింగ్ కోబ్రాగా అని అనుకున్నారు. కానీ కాదని స్నేక్ క్యాచర్స్ తేల్చారు.  స్థానికులు ఆ పామును చూసి బెంబేలెత్తిపోయి… స్నేక్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫోన్ చేయగా… క్యాచర్స్ రామచంద్ర సాహు, గౌరీ సాహు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరికీ హాని లేకుండా ఆ ప్రాంంతో గుమికూడిన వారిని చెదరగొట్టారు.  వారు ఆపై జాగ్రత్తగా ఆ పామును బంధించారు.

అయితే, పామును బంధించిన తర్వాత స్నేక్ క్యాచర్స్ ఆశ్చర్యకర విషయం చెప్పారు. అది కింగ్ కాబ్రా కానే కాదని గుర్తించారు.  ఈ తరహా పాముని తామెప్పుడు చూడలేదని. అదో అరుదైన, గుర్తించబడని జాతికి చెందిన పాము అని వెల్లడించారు. తమ అంచనా ప్రకారం ఆ పాము చైనీస్ మూలాలకు చెందినది కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదో పెట్ స్నేక్ కావొచ్చని.. ఎవరైనా వదలేయడమో, లేక తప్పించికుని రావడమో జరిగి ఉండొచ్చన్నారు.

Snake

ఆ తర్వాత పామును జాగ్రత్తగా తీసుకెళ్లి కెరాండి అడవిలోకి వదిలేశారు. అయితే..  గుర్తించబడని, స్థానికేతర జాతికి చెందిన పాము లోకల్ అడవిలోకి విడుదల చేయడం కరెక్ట్ కాదని.. కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పాము వల్ల ఇతర జీవులకు.. లేదా మిగతా వాటి వల్ల దానికి ప్రమాదం ఉందని చెప్పారు. మరి అది ఏ జాతి పాము అన్నది..  వన్యప్రాణి అధికారులు నిర్ధారించాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..