హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో విరిగి పడిన కొండ చరియలు..11 మంది మృతి..30 మందికి పైగా గల్లంతు
Land Slide In Himachal

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో విరిగి పడిన కొండ చరియలు..11 మంది మృతి..30 మందికి పైగా గల్లంతు

| Edited By: Phani CH

Aug 11, 2021 | 8:00 PM

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో బుధవారం కొండ చరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గల్లంతయ్యారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో బుధవారం కొండ చరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ జిల్లాలోని రెకాంగ్-పియో షిమ్లా హైవేలో వెళ్తున్న ఓ బస్సు, ట్రక్కు, కార్లు, కొన్ని ఇతర వాహనాలు శిథిలాల్లో చిక్కుకుపోవడంతో మరణించినవారు గానీ, గల్లంతయినవారు గానీ ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ వాహనాలు సిమ్లాకు వెళ్తున్నట్టు తెలుస్థోంది. 10 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఈ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్తుండగా ఒక్కసారిగా బండరాళ్లు, కొండ చరియలు విరిగిపడ్డాయని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. కేంద్రం నుంచి ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు విభాగానికి చెందిన 200 బృందాలు సహాయక చర్యల కోసం వస్తున్నాయన్నారు. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దింపుతున్నట్టు ఆయన చెప్పారు. కాగా-ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో ఠాకూర్ తో మాట్లాడి కేంద్రం నుంచి ఏ సాయం అవసరమైనా అందిస్తామని హామీ ఇచ్చారు.

అటు- ఈ రాత్రంతా సహాయక చర్యలు కొనసాగుతాయని, ఈ ప్రాంతం చాలా ప్రమాదకరంగా ఉందని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు విభాగం అధికార ప్రతినిధి వివేక్ పాండే తెలిపారు. కొండ విరిగిపడుతున్న దృశ్యాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత నెలలో ఇదే జిల్లాలో మరో చోట సంభవించిన ఈ తరహా ప్రమాదాల్లో 9 మంది టూరిస్టులు మరణించారు. గత కొన్ని వారాలుగా భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Samantha: మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇలా చేయండి.. సమంత చెబుతోన్న ఫిట్‌నెస్‌ పాఠాలు ఏంటో చూడండి.

ఇంద్రవెల్లి ఓ ఎత్తు, ఇబ్రహీంపట్నం మరో ఎత్తు.. నల్గొండ నాయకులు రేవంత్ రెడ్డి లైన్లోకి వస్తారా.!