Watch Video: ఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్.. టీచరమ్మ నేర్పుతున్న పాఠం

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై ఈ లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే చాలావరకు తెలసిన వారి నుంచే చిన్నారులు ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను చూసుకుంటే చిన్న పిల్లలకు శరీర అవయవాల గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం.

Watch Video: ఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్.. టీచరమ్మ నేర్పుతున్న పాఠం
Teacher

Updated on: Sep 04, 2023 | 6:29 PM

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై ఈ లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే చాలావరకు తెలసిన వారి నుంచే చిన్నారులు ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను చూసుకుంటే చిన్న పిల్లలకు శరీర అవయవాల గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. వాస్తవానికి శరీరానికి కూడా సొంతంగా కొన్ని నియమాలు ఉంటాయని చిన్నపిల్లలకు తెలియజేయండం ఎంతో ముఖ్యం. ఒకవేళ వాటిని ఇతరులు అతిక్రమిస్తున్నప్పుడు కేవలం స్పందించడమే కాదు.. వెంటనే ఎలా వ్యతిరేకించాలో కూడా నేర్పించాలి. అయితే అచ్చం ఇలాంటి పనే చేశారు ఓ టీచర్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చిన్నారులకు అర్థమయ్యేలా వివరించారు.

అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో గమనిస్తే ఒక స్కూల్ టీచర్.. విద్యార్థులకు ఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్ అనేది స్వయంగా వివరించారు. ఎదుటి వ్యక్తులు ఛాతిపై తడమటం.. గట్టిగా కౌగిలించుకోవడం అలాగే శారీరకంగా, మానసికంగా చూసుకుంటే హాని కలిగించేలా అసభ్యంగా తాకడం వంటివి చేస్తే పిల్లలు ఎలా ప్రతిఘటించాలో అనే దానిపై కూడా ఆ చిన్నారులకు చూపించారు. ఆప్యాయంగా తాకడం.. దురుద్దేశపూర్వకంగా ముట్టుకోవడం లాంటి తేడాలను ఆ విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు టీచర్. అయితే ఇది ఏ పాఠశాలలో.. ఎప్పుడు జరిగిందో తెలియదు. కానీ రోషన్ రాయ్ అనే ఒక నెటిజన్ ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విద్యార్థులకు జీవిత పాఠం నేర్పిస్తున్న ఆ టీచర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని స్కూళ్లలో కూడా ఇలాంటి విద్యను టీచర్లు విద్యార్థులకు నేర్పించినట్లైతే భవిష్యత్ తరాల నుంచి రక్షించవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే చిన్న పిల్లలపై చాలావరకు లైంగిక నేరాలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. అందుకే విద్యార్థులకు చిన్నప్పుడే ఇలాంటివి నేర్పిస్తే వారు అప్రమత్తంగా ఉంటారు. ఎవరైనా వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కూడా ఆ చిన్నారులు తప్పించుకోగలుగుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..