తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగిన పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నకిలీ మద్యం తాగిన వారిలో 10మంది మృత్యువాతపడ్డారు. సుమారు 50 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కల్తీ మద్యం తాగిన వారందరూ విపరీతమైన తలనొప్పి, వాంతులు, స్పృహతప్పి పడిపోవడంతో వారిని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో కల్తీ మద్యానికి పది మంది ప్రాణాలు కోల్పోయారు.. కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను హుటాహుటినా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. వారిలో కొందరినీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై సీబీ-సీఐడీ విచారణకు స్టాలిన్ ఆదేశించారు. అదే సమయంలో కలెక్టర్ శ్రావణ్‌కుమార్ జతావత్‌పై బదిలీ వేటు వేశారు. కళ్లకురిచ్చి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎంఎస్ ప్రశాంత్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే కళ్లకురిచ్చి ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్పీగా రజత్ చతుర్వేది నియమితులయ్యారు. అలాగే, ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులను సైతం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే, అదే గ్రామానికి చెందిన 10 మందికి పైగా మృతి చెందడం ఈ ప్రాంత ప్రజల్లో విషాదాన్ని నింపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…