ప్ర‌ఖ్యాత గోల్డెన్ టెంపుల్‌లో చోరీ.. విరాళాల కౌంటర్ నుంచి నగదు లూటీ.. ఆ నలుగురిపై అనుమానం..!

|

Nov 28, 2023 | 8:30 PM

స్వర్ణదేవాలంలో చోరీ ఘటన సంచలనంగా మారింది. గురునానక్ జయంతికి ఒక రోజు ముందు స్వ‌ర్ణ‌దేవాల‌యం విరాళాల కౌంట‌ర్ నుంచి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లారు. ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు సందర్శించే పవిత్ర క్షేత్రంలో దొంగతనం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సీసీటీవీ వీడియోల సాయంతో ఉద్యోగులు చోరీ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.

ప్ర‌ఖ్యాత గోల్డెన్ టెంపుల్‌లో చోరీ.. విరాళాల కౌంటర్ నుంచి నగదు లూటీ.. ఆ నలుగురిపై అనుమానం..!
Golden Temple Theft
Follow us on

పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని ప్రఖ్ఆత గోల్డెన్ టెంపుల్‌లో దొంగలు పడ్డారు. కౌంటర్‌ నుంచి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లారు దుండగులు. అమృత్‌సర్‌ స్వర్ణదేవాలంలో చోరీ ఘటన సంచలనంగా మారింది. విరాళాల కౌంటర్‌ నుంచి లక్ష రూపాయలు మాయం కావటం పట్ల సర్వత్ర కలకలం సృష్టించింది. చోరీ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గురునానక్ జయంతికి ఒకరోజు ముందు దొంగతనం ఘటన జరిగింది. కాగా, చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ మేరకు గోల్డెన్‌ టెంపుల్‌ ఉద్యోగులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా చోరీపై విచారణ జరిపించాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలోనే నలుగురు అనుమానితులపై ఫిర్యాదు చేశారని తెలిసింది.

పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని ప్ర‌ఖ్యాత గోల్డెన్ టెంపుల్‌లో చోరీ జ‌రిగింది. గురునానక్ జయంతికి ఒక రోజు ముందు స్వ‌ర్ణ‌దేవాల‌యం విరాళాల కౌంట‌ర్ నుంచి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లారు. ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు సందర్శించే పవిత్ర క్షేత్రంలో దొంగతనం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సీసీటీవీ వీడియోల సాయంతో ఉద్యోగులు చోరీ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

సీసీ ఫుటేజ్‌ ఆధారంగా.. ఆదివారం సాయంత్రం న‌లుగురు వ్య‌క్తులు స్వర్ణ దేవాల‌యాన్ని సందర్శించారు. త‌మ ల‌క్ష రూపాయలు దొంగ‌లు కొట్టేశార‌ని ఆరోపిస్తూ శ్రీ హర్‌మందిర్ సాహిబ్ గురుద్వారా విరాళాల కౌంటర్ ప్రాంగణాన్ని సందర్శించారు ఆ నలుగురు వ్యక్తులు. వారే ల‌క్ష చోరీ చేసి ఉండ‌వ‌చ్చ‌ని సిబ్బంది అనుమానించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆల‌యంలో నిర్వహించే అర్దాలు, లంగర్లు, కల్యాణ కార్యక్రమాల కోసం భక్తులు కానుక‌లు, డ‌బ్బులు హుండీలో వేస్తుంటారు. అలా డిపాజిట్ చేసిన సొమ్ముతో ఆ న‌లుగురు పరారైనట్టు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..