Watch: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. ఒకరి మృతి.. పంజాబ్‌లో టెన్షన్‌ టన్షన్..!

మంగళవారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో మజితా రోడ్‌ బైపాస్‌లోని డీసెంట్‌ అవెన్యూ కాలనీ సమీపంలో పేలుడు సంభవించింది. పెద్ద శబ్ధంతో ఆకస్మిక పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో పరిశీలిస్తున్నారు.

Watch: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. ఒకరి మృతి.. పంజాబ్‌లో టెన్షన్‌ టన్షన్..!
Blast In Amritsar

Updated on: May 27, 2025 | 12:51 PM

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం రేపింది. మే 27 మంగళవారం రోజున అమృత్‌సర్‌లోని మజితా రోడ్ బైపాస్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఒక వ్యక్తి మరణించినట్టుగా తెలిసింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు పదార్థం తయారీపై ఫోరెన్సిక్‌ అధికారులు పరిశీలిస్తున్నారని పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌స్టర్లు లేదా ఉగ్రవాదుల ప్రమేయం లేకపోవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గోల్డెన్ టెంపుల్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

మంగళవారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో మజితా రోడ్‌ బైపాస్‌లోని డీసెంట్‌ అవెన్యూ కాలనీ సమీపంలో పేలుడు సంభవించింది. పెద్ద శబ్ధంతో ఆకస్మిక పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో పరిశీలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..