వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసు

తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నిడమర్రు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను చెప్పాలనుకుంటే ఆయన కనిపించడం లేదని.. ఇల్లు, కార్యాలయం వెతికినా ఫలితం లేదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకొని తమ ఎమ్మెల్యేను అప్పగించాలంటూ వారు కోరారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మంత్రుల మాటలతో అమరావతి ప్రాంత ప్రజల్లో ఆందోళన […]

వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసు
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 1:06 PM

తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నిడమర్రు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను చెప్పాలనుకుంటే ఆయన కనిపించడం లేదని.. ఇల్లు, కార్యాలయం వెతికినా ఫలితం లేదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకొని తమ ఎమ్మెల్యేను అప్పగించాలంటూ వారు కోరారు.

అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మంత్రుల మాటలతో అమరావతి ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాజధానిని మార్చి తమ పొట్ట కొట్టకండి అంటూ వారు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో అమరావతి ప్రాంతానికి చేరుకుంటున్న రైతులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మూడు రాజధానులను ప్రకటించక ముందు అమరావతి ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తూ వస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. రాజధాని పనులు ఇక్కడ కొనసాగుతాయని.. భూముల గురించి ఎలాంటి దిగులు చెందొద్దని ఆయన అన్నారు. అంతేకాదు పూలింగ్ ప్రక్రియలో రైతుల నుంచి తీసుకున్న భూములకు తమ ప్రభుత్వం మంచి రేటును ఇస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చినప్పటి నుంచి ఆర్కే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి తోడు అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు. దీంతో నిడుమర్రు రైతులు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి సైతం రాజధాని సెగలు తగులుకున్నాయి. ‘‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు. కాస్త వెతికి పెట్టండి’’ అంటూ మహిళలు తాజాగా ఫిర్యాదు చేశారు. కాగా రాజధాని ప్రకటన తరువాత వీరిద్దరి అయోమయంలో పడ్డట్లు తెలుస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో