వైరల్‌ అవుతోన్న న్యాయవాది ‘వధువు’ ప్రకటన.. భిన్నంగా స్పందిస్తోన్న నెటిజన్లు

మ్యాట్రీమొనీ సైట్‌లు ఎన్ని వచ్చినా.. పెళ్లి కోసం ఇప్పటికీ కొంతమంది పేపర్లలో ప్రకటనలు ఇస్తుంటారు.

వైరల్‌ అవుతోన్న న్యాయవాది 'వధువు' ప్రకటన.. భిన్నంగా స్పందిస్తోన్న నెటిజన్లు
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2020 | 4:57 PM

Lawyer matrimonial ad: మ్యాట్రీమొనీ సైట్‌లు ఎన్ని వచ్చినా.. పెళ్లి కోసం ఇప్పటికీ కొంతమంది పేపర్లలో ప్రకటనలు ఇస్తుంటారు. అలా ఇచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వధువు కావాలంటూ ప్రకటన ఇచ్చిన ఓ వ్యక్తి, తనకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో అందులో వివరించాడు. ఇక అందులో అతగాడి కోరికకు నెటిజన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌ కమర్‌పుకుర్‌కి చెందిన చటర్టీ అనే వ్యక్తి ఇటీవల ఓ వధువు ప్రకటనను ఇచ్చారు. అందులో చటర్జీ(37/5’7”) యోగా ప్రాక్టిసనర్‌, అందమైనవాడు, ఎలాంటి అలవాటు లేని వాడు, హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నాడు. అలాగే పరిశోధకుడు. అమ్మనాన్నలు ఉన్నారు. ఓ కారు కూడా ఉంది. కమర్‌పుకుర్‌ గ్రామంలో ఓ ఇల్లు ఉంది. అందమైన, ఎత్తుగా, సన్నగా ఉండే ఓ వధువు కావాలి. వధువు సోషల్ మీడియాకు బానిస అయ్యి ఉండకూడదు అంటూ వెల్లడించారు. దీన్ని నితిన్‌ సాంగ్వాన్ అనే ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వధువు/వరుడు ఇక్కడ కొంచెం చూడండి. పెళ్లి విషయంలో ఆలోచనలు మారుతున్నాయి అని కామెంట్‌ పెట్టారు. ఇక ఈ పోస్ట్‌కు నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో నీకు ఈ జన్మలో పెళ్లి కాదని, మరికొందరేమో ఈ కాలంలో అలాంటి అమ్మాయి ఉండదులే అని, ఇంకొందరు ఇదేం వివక్ష అని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Read More:

వీధి లైట్లకు ఆటోమెటిక్ స్విచ్‌.. పదో తరగతి విద్యార్థి అద్భుత‌ ప్రతిభ

Breaking: వైద్య శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్‌

Latest Articles