వీధి లైట్లకు ఆటోమెటిక్ స్విచ్‌.. పదో తరగతి విద్యార్థి అద్భుత‌ ప్రతిభ

తెలంగాణలో పదో తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభను చూపారు. వీధి లైట్లకు ఆటోమెటిక్ స్విచ్‌ని తయారుచేశారు. ఎవరి సహాయం లేకుండా ఆటోమెటిక్‌గా

వీధి లైట్లకు ఆటోమెటిక్ స్విచ్‌.. పదో తరగతి విద్యార్థి అద్భుత‌ ప్రతిభ
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2020 | 4:16 PM

Automatic switch for streetlights: తెలంగాణలో పదో తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభను చూపారు. వీధి లైట్లకు ఆటోమెటిక్ స్విచ్‌ని తయారుచేశారు. ఎవరి సహాయం లేకుండా ఆటోమెటిక్‌గా అవే ఆన్‌/ఆఫ్ అయ్యేలా పరికరాన్ని తయారుచేశారు. దీంతో ఇప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే..జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపహాడ్‌ మోడల్‌ స్కూల్‌లో‌ పదో తరగతి విద్యార్థి శశిధర్‌ రోజూ పాఠశాలకు వెళ్లే సమయంలో వీధి దీపాలు వెలుగుతుండడాన్ని గమనించారు. దీంతో రాత్రి పూట మాత్రమే  వీధి దీపాలు వెలిగేలా కొత్త పరికరాన్ని తయారు చేయాలని భావించారు. ఈ క్రమంలో ఓ పరికరం తయారు చేశాడు. అందులో ఆటోమెటిక్‌గా‌ ఆన్/ఆఫ్ అయ్యేలా సిస్టమ్‌ని అరేంజ్ చేశారు గతంలో ఒక్క బల్బు మాత్రమే ఆటోమెటిక్‌గా ఆన్‌ ఆఫ్‌ అయ్యేలా రూపొందించారు.

ఇక ఈ పరికరాన్ని మహాముత్తారం మండలంలో గిరిజన గ్రామమైన మాదారంలో విద్యుత్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రయోగాత్మకంగా ఓ స్తంభానికి అమర్చగా.. అది విజయవంతమైంది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు శశిధర్‌ను అభినందించారు. మాదారం సర్పంచ్‌, శశిధర్‌కి నగదు సాయం చేశారు. ఇక తాను తయారు చేసిన పరికరాలను సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు, భూపాలపల్లి కలెక్టర్‌ అబ్దుల్‌ అజీంకు చూపించాలని ఉందని శశిధర్‌ పేర్కొన్నారు. కాగా కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆటోమెటిక్‌ శానిటైజర్‌ని తయారు చేసిన శశిధర్‌.. అప్పుడు కూడా పలువురి ప్రశంసలను పొందారు.

Read More:

Breaking: వైద్య శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్‌

క్రేజీ న్యూస్‌.. విజయ్‌- అనుష్క కాంబోలో మూవీ..!

Latest Articles
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?