
చూడటానికి చిన్న నల్ల నువ్వుల్లా కనిపించే ఈ సీడ్స్ నుంచి తీసే ఈ నూనెలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే థైమోక్వినోన్ అనే సమ్మేళనం జుట్టు కుదుళ్లకు మంచి చేస్తుంది. జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు మొలిచేందుకు సహాయపడతాయి. జట్టు రాలడానికి స్కాల్ప్ ఆర్యోగ్యంగా లేకపోవడం కూడా ఒక కారణం. తల చర్మంపై దురద లేదా చుండ్రు ఉంటే జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నల్ల జీలకర్ర నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తల చర్మానికి పోషణ అందించి జుట్టు వేర్లను బలపరుస్తాయి. వారానికి రెండు నుంచి మూడు సార్లు నల్ల జీలకర్ర నూనెతో తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది తల చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. దీంతో హెయిర్ ఫాలికల్స్ బలపడుతూ జుట్టు వేగంగా పెరుగుతుంది. అలాగే తల చర్మంలో ఉండే పొడి, డాండ్రఫ్ సమస్యలను తగ్గించడంలో కూడా నల్ల జీలకర్ర నూనె ఉపయోగపడుతుంది.
నల్ల జీలకర్ర నూనెను ఇతర నూనెలతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో కలిపి తలకు మసాజ్ చేస్తే మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది జుట్టుకు తేమను అందించి జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అదనంగా, నల్ల జీలకర్ర నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, దురద వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
మొత్తానికి, నల్ల జీలకర్ర నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడమే కాకుండా డాండ్రఫ్, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. సహజంగా జుట్టు సంరక్షణ కోరుకునేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.
మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..