World Tourism Day: బిజీ లైఫ్ నుంచి ఉపశమనం కోసం మనదేశంలో ఈ ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శించండి..

|

Sep 27, 2024 | 3:43 PM

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారతదేశంలో తక్కువగా సందర్శించే , అందమైన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. తద్వారా నగర జీవితంలోని హడావిడి నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు లేదా జనసమూహంనుంచి దూరంగా ఉండాలనుకున్నప్పుడు విహార యాత్రకు బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

World Tourism Day: బిజీ లైఫ్ నుంచి ఉపశమనం కోసం మనదేశంలో ఈ ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శించండి..
World Tourism Day
Follow us on

భారతదేశం పర్యటన కోసం అనేక ప్రదేశాలున్నాయి. ప్రసిద్ధ టూరిస్ట్ హాట్‌స్పాట్‌ల నుంచి విచిత్రమైన, ప్రశాంతమైన ప్రదేశాల వరకు ప్రతి ఒక్కరికీ ఒక గమ్యస్థానం ఉంది. అయితే ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారతదేశంలో తక్కువగా సందర్శించే , అందమైన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. తద్వారా నగర జీవితంలోని హడావిడి నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు లేదా జనసమూహంనుంచి దూరంగా ఉండాలనుకున్నప్పుడు విహార యాత్రకు బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

లేహ్ జిల్లాలో ఉన్న ఒక విచిత్రమైన.. అందమైన గ్రామం హేమిస్. ఈ ప్రాంతం అనేక కారణాల వల్ల అన్వేషించదగినది. ఉత్తరాన కారకోరం పర్వతాలు, దక్షిణాన హిమాలయాల మధ్య శాండ్‌విచ్ గా కనిపించే ఈ ఆఫ్-బీట్ గమ్యస్థానం ప్రసిద్ధ హేమిస్ మొనాస్టరీకి ప్రసిద్ధి చెందింది. హెమిస్ నేషనల్ పార్క్‌కు నిలయం. ఇక్కడ మీరు అరుదైన మంచు చిరుతపులిని చూడవచ్చు. తోడేళ్ళు, ఎర్ర నక్కలు, జింకలు, వంటి అనేక వన్య మృగాలను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

సందర్శించడానికి ఉత్తమ సమయం: జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య.

మవ్లినాంగ్, మేఘాలయ

ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరొందిన మవ్లినాంగ్ మేఘాలయలో ఒక అడ్వెంచర్ హబ్. ఇది ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. తక్కువ మంది సందర్శించే ఈ చిన్న గ్రామం దాని సహజ సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. స్థానిక సంస్కృతిలో మునిగిపోయే అవకాశాన్ని అందిస్తుంది. సందర్శకులు గ్రామాన్ని అన్వేషించవచ్చు. అందమైన పూల తోటలు, జలపాతాలను సందర్శించవచ్చు.

సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుంచి నవంబర్.

గురెజ్ వ్యాలీ, కాశ్మీర్

మంచుతో కప్పబడిన శిఖరాలు, గలగాలాడే ప్రవాహాల మధ్య గొర్రెల కాపరుల సంచార జీవనశైలిని అనుభవించడం బిజీ జీవితంలో ఒక అందమైన అనుభవం. ఈ రిమోట్ వ్యాలీ భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన గమ్యస్థానాలలో ఒకటి. ఇది హిమాలయాల పర్వతాల అద్భుతమైన వీక్షణలు, క్యాంపింగ్ అనుభవాలు, స్థానిక సంస్కృతి, వంటకాలలో మునిగిపోయే అవకాశాన్ని కలిగి ఉన్న సుందరమైన ట్రెక్కింగ్ మార్గాలను అందిస్తుంది. వులర్ సరస్సు, హబ్బా ఖాటూన్ శిఖరం, రజ్దాన్ పాస్ లు ఇక్కడ కొన్ని ప్రసిద్ధ ఆకర్షణ ప్రాంతాలు.

సందర్శించడానికి ఉత్తమ సమయం: మే చివరి నుంచి అక్టోబర్ ప్రారంభం వరకు.

చోప్తా, ఉత్తరాఖండ్

ఒక అందమైన హిల్ స్టేషన్. ఉత్తరాఖండ్‌లోని చోప్తా ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి కార్యకలాపాలను ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవడానికి ఆఫ్-బీట్ ప్రయాణికులకు ఒక ప్రదేశం. ఈ ప్రదేశం దాని ప్రసిద్ధ తుంగనాథ్ ఆలయ ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి చెందింది. పంచ కేదార్లలో ఒకటి. శివునికి అంకితం చేయబడిన ఎత్తైన ఆలయం. చంద్రశిల శిఖరం ఇక్కడ హిమాలయాల పర్వత శిఖరం వీక్షించడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం: ఏప్రిల్ నుంచి జూన్ మధ్య.

సందక్ఫు, డార్జిలింగ్

సందక్ఫు డార్జిలింగ్‌లోని ఒక చిన్న పట్టణం. ఇది తూర్పు హిమాలయాలలో ఎత్తైన ప్రదేశం. సాహస ఔత్సాహికులు సందక్ఫు ఫలుట్ ట్రెక్కింగ్ కు కూడా వెళ్తారు. ఇది ప్రపంచంలోని నాలుగు ఎత్తైన శిఖరాలైన స్లీపింగ్ బుద్ధుడు, కాంచన్‌ గంగా, లోట్సే, మకాలును చూడవచ్చు. ఓక అందమైన ఉత్కంఠభరితమైన అనుభూతిని అందిస్తుంది. ఫలుట్, మేఘ్మా , తుమ్లింగ్ సందక్ఫులో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలు.

సందర్శించడానికి ఉత్తమ సమయం: సంవత్సరంలో ఏ సమయంలోనైనా. అయితే, సందక్ఫు ఫలుట్ ట్రెక్ వసంతకాలం (మార్చి నుండి మే), శరదృతువు (అక్టోబర్ నుండి నవంబర్ వరకు) చేయవచ్చు.

కాషిద్, మహారాష్ట్ర

కొంకణ బెల్ట్‌లో ఉన్న ఈ తీర పట్టణం అత్యంత ఆకర్షణీయమైన బీచ్‌లలో ఒకటి. దాని చుట్టూ గంభీరమైన కొండలు, స్ఫటికాకార నీరు, బంగారు ఇసుక ఉన్నాయి. దేశంలో అందమైన బీచ్‌లలో ఇది ఒకటి. మురుద్ జంజీరా కోట, ఫన్‌సద్ వన్యప్రాణుల అభయారణ్యం, రేవ్‌దండ బీచ్ ఫోర్ట్, కొర్లై ఫోర్ట్ ఇక్కడ తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు.

సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..