Winter Sleeping Tips: మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా? అయితే మీ హార్ట్ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే

|

Jan 08, 2025 | 3:12 PM

చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల రాత్రిళ్లు చలి తీవ్రంగా ఉంటుంది. దీంతో వెచ్చగా ఉండేందుకు చాలా మంది స్వెటర్లు, సాక్స్ వంటి దళసరి వస్త్రాలు ధరించి నిద్రిస్తుంటారు. అయితే ఈ పద్ధతి ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఇలా నిద్రించడం వల్ల గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందట. ఎలాగంటే..

Winter Sleeping Tips: మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా? అయితే మీ హార్ట్ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే
Winter Sleeping
Follow us on

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తాం. వెచ్చగా ఉండటానికి దళసరి బట్టలు ధరించడం, స్వెటర్స్‌, సాక్స్‌లు వంటివి ధరించడం చేస్తుంటాం. అయితే కొంత మంది మాత్రం రాత్రిపూట స్వెటర్లు, సాక్స్‌లతో నిద్రపోతుంటారు. వెచ్చగా నిద్రపోవడానికి ఈ విధానం సౌకర్యవంతంగా అనిపించవచ్చు. కానీ స్వెటర్లు, సాక్స్‌లతో నిద్రించే అలవాటు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చలికి దూరంగా ఉండాలంటే వెచ్చటి బట్టలు వేసుకుని పడుకోవడం మంచిదని కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..

మనం నిద్రపోతున్నప్పుడు శరీరం ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తుంది. వెచ్చని దుస్తుల్లో నిద్రిస్తున్నప్పుడు ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఇది వివిధ శారీరక సమస్యలకు దారి తీస్తుంది. చలి నుంచి బయటపడేందుకు స్వెటర్లు, సాక్స్‌లతో నిద్రించే అలవాటు చర్మం, రక్త ప్రసరణ, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో స్వెటర్లు, సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

రాత్రిపూట స్వెటర్‌తో నిద్రపోవడం వల్ల గుండె జబ్బులను ఆహ్వానించడమే అవుతుంది. నిజానికి ఉన్ని వస్ర్తాల్లో దట్టమైన ఫైబర్స్ ఉంటుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. రాత్రిపూట శరీర ఉష్ణోగ్రతతో పాటు వెచ్చగా ఉండటానికి ఉన్ని బట్టలు ధరిస్తే.. అధిక శరీర వేడి కారణంగా మధుమేహం, గుండె జబ్బు రోగులకు హానికరం.

ఇవి కూడా చదవండి

చలికాలంలో శరీరంలో ఉండే రక్తనాళాలు కుచించుచుకుపోయి చిన్నవిగా మారతాయని వైద్యులు చెబుతున్నారు. అదే ఉన్ని బట్టలు ధరించి నిద్రిస్తున్నప్పుడు, శరీరం వేడిగా మారుతుంది. ఇలా వేడెక్కడం వల్ల విశ్రాంతి లేకపోవడం, భయం, తక్కువ రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కాటన్ దుస్తులు ధరించి రాత్రిళ్లు నిద్రపోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచుతుంది. రాత్రి బాగా నిద్రపడుతుంది.

ఉన్ని వస్ర్తాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. కాబట్టి, స్వెటర్లు, సాక్కులు ధరించి నిద్రిస్తే, చెమట అధికంగా పట్టవచ్చు. చెమట వల్ల చికాకు, దురద, అలెర్జీలకు కూడా వస్తాయి. పొడి చర్మం ఉన్నట్లయితే, ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ఇలాంటి దుస్తులకు దూరంగా ఉండటం మంచిది.

మంచి నిద్ర కోసం చలికాలంలో పడుకునే ముందు గది ఉష్ణోగ్రతను 10-20 డిగ్రీలు ఉంచడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అంతేకాకుండా దళసరి వస్త్రాలు ధరించడానికి బదులు కాటన్ దుస్తులు ధరించవచ్చు. అలాగే నిద్రపోయే ముందు యోగా చేస్తే.. ఒత్తిడిని తగ్గించి కమ్మని నిద్రవచ్చేలా ప్రేరేపిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.