రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు తరచుగా చల్లని వాతావరణంలో దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ , కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, పండ్లను కూడా తినే ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లోని చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్, ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే పండ్ల సరైన కలయిక శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని చెప్పారు. వీటిని తినడం ద్వారా మీకు విటమిన్ ఎ, బి12, సి లభిస్తాయి. దీంతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చలికాలంలో ఏ పండ్లను తినాలంటే
కమలా ఫలం, దానిమ్మపండు: రోగనిరోధక శక్తిని పెంచడానికి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లను తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఈ పండ్లలో బెస్ట్ ఎంపిక కమలా ఫలం, దానిమ్మపండు కలయిక. కమలా ఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబుతో పోరాడడంలో సహాయపడతాయి.
ఆపిల్, పియర్స్ : అదేవిధంగా ఆపిల్, పియర్లను కలిపి తినవచ్చు. ఈ రెండు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నిర్వహించడంతో పాటు శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి. పియర్‌లో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది.
జామ పండు, కివి కలయిక: చలి కాలంలో జామ పండు, కివి కలయిక కూడా శీతాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జామపండులో అధికంగా విటమిన్ సి ఉంటుంది. అయితే కివిలో ఉండే విటమిన్ ఇ, పొటాషియం ఉంటుంది. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అరటి , బొప్పాయి: చలికాలంలో బద్ధకం పోయి.. తక్షణ శక్తి కావాలంటే, అరటి పండు, బొప్పాయి మంచి ఎంపిక. ఈ రెండు పండ్లు సులభంగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
డ్రై ఫ్రూట్స్ తో పండ్లు :ఖర్జూరం లేదా అత్తి పండ్ల వంటి డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తాజా పండ్లను తినడం కూడా శీతాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సీజనల్ పండ్లను అందునా కలిపి తినడం వలన శీతాకాలంలో తింటే రోగనిరోధక శక్తి పెరగడమే కాదు జలుబు, అలసట నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అయితే తాజా, కాలానుగుణ పండ్లను మాత్రమే తినడానికి ప్రయత్నించండి. ఎక్కువ చల్లదనం ఇచ్చే పండ్లకు దూరంగా ఉండండి..