Palm Lines : భవిష్యత్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది మానవజాతి సహజ స్వభావం అని చెప్పవచ్చు. అయితే భవిష్యత్ గురించి తెలుసుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. హస్తసాముద్రికం మీద నమ్మకం ఉన్న వారు జ్యోతిష్యులకు చేతులు చూపి భవిష్యత్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే మానవుడి గురించిన మొత్తం సమాచారం కేవలం హస్తసాముద్రికం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు.
ఒక బిడ్డ జన్మించినప్పుడు అతని చేతిలో ఉన్న రేఖలు చక్కగా ఉంటాయి. ఇవి కాలంతో పాటు ముదురుతాయి. అయితే కాలంతో పాటు మన చేతి రేఖలు కూడా మారుతాయా అనేది అందరికి సహజంగా వచ్చే డౌట్. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు కచ్చితంగా మారుతాయి. మన చేతిలోని అరచేతిలోని రేఖలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అయినప్పటికీ హస్తసాముద్రికం అకస్మాత్తుగా మారదు. ఒక వ్యక్తి చేసే పనుల ప్రకారం అతని అరచేతులు మారుతాయి.
మన చేతుల రేఖలు మన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి సంతోషకరమైన జీవితం గురించి తెలియజేస్తాయి. ఇది మన విధి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. మన వివాహ జీవితం ఎలా ఉంటుంది, మనకు ఎంత డబ్బు వస్తుంది, జీవితంలో ఎంత ఇబ్బంది ఉంటుంది, భవిష్యత్తులో మనకు విజయం లభిస్తుందా లేదా అనేక విషయాల గురించి తెలుసుకోవచ్చు.కొంతమంది హస్తసాముద్రికాన్ని చాలా నమ్ముతారు మరి కొంతమంది దీనిని శారీరక రూపంలో భాగంగా మాత్రమే భావిస్తారు. కొంతమంది చేతుల రేఖలను చూడటం ద్వారా భవిష్యత్తును తెలుసుకోవటానికి ఇష్టపడరు. వాస్తవానికి వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటే అలవాట్లు క్షీణిస్తాయని భయపడుతారు. మరికొంతమంది భవిష్యత్తు బాగా లేకపోతే నిరాశకు గురికావల్సి వస్తోందని అనుకుంటారు.