Bad Breath: బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవడంలేదా.. అప్పుడేం చేయాలో తెలుసుకోండి..!

Oral hygiene tips: నోటీ నుంచి దుర్వాసన అనేది కేవలం పళ్ల సమస్య మాత్రమే కాదు.. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఇతర కారణాలు కూడా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. బ్రష్ చేసిన తర్వాత కూడా సమస్య కొనసాగితే..ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. నోటి దుర్వాసనను నివారించేందుకు తీసుకోవాలని చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Bad Breath: బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవడంలేదా.. అప్పుడేం చేయాలో తెలుసుకోండి..!
Bad Breath

Updated on: Jan 25, 2026 | 4:14 PM

Mouth odor solutions: నోటి దుర్వాసన అనేది కొందరు ఎదుర్కొంటున్న చాలా చెడ్డ సమస్య. తాము రోడు సార్లు బ్రష్ చేసుకున్నా.. నోటీ దుర్వాసన పోవడం లేదని బాధపడుతుంటారు. నోటి దుర్వాసన కారణంగా వారితో మాట్లాడేందుకు చాలా మంది ఇష్టపడరు. వారికి దూరంగా వెళతారు. ఈ సమస్య అతనితోపాటు ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతుంది. నోటీ నుంచి దుర్వాసన అనేది కేవలం పళ్ల సమస్య మాత్రమే కాదు.. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఇతర కారణాలు కూడా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. నోటి దుర్వాసనను నివారించేందుకు తీసుకోవాలని చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నోటి దుర్వాసన (Bad Breath / Halitosis) అనేది చాలామందికి ఇబ్బందికరమైన సమస్య. ఇది వ్యక్తిగత ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. బ్రష్ చేసిన తర్వాత కూడా సమస్య కొనసాగితే..ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు

నాలుక శుభ్రం చేయకపోవడంతో నాలుకపై బాక్టీరియా చేరి దుర్వాసన కలుగుతుంది.
నోరు పొడిగా ఉండటం (Dry Mouth) వల్ల లాలాజలం తగ్గితే దుర్వాసన పెరుగుతుంది.
పళ్ల మధ్య ఆహార అవశేషాలు ఉండటం వల్ల ఫ్లాస్ ఉపయోగించకపోతే సమస్య ఏర్పడుతుంది.
గ్యాస్ట్రిక్, అసిడిటీ లొంటి పొట్ట సమస్యలు.
పళ్ల కుళ్లు, చిగుళ్ల వాపు లాంటి దంత సమస్యలు.
ధూమపానం, మద్యపానం అలవాట్లతో కూడా నోటీ దుర్వాసన వస్తుంది.

దుర్వాసన తగ్గేందుకు ఏం చేయాలి?

రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడంతో పాటు నాలుకను తప్పనిసరిగా శుభ్రం చేయాలి.
మౌత్ వాష్ లేదా ఉప్పు నీటితో పుక్కిలించాలి.
రోజుకు ఎక్కువ నీరు తాగాలి.
ఫ్లాసింగ్ అలవాటు చేసుకోవాలి.
వెల్లుల్లి, ఉల్లిపాయల తీసుకున్న తర్వాత నోటిని శుభ్రం చేయాలి.
పొట్ట సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి.

నోటి దుర్వాసనను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది లోపలి ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే, బ్రష్ చేయడం ఒక్కటే పరిష్కారం కాదు. సరైన నోటి పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారం, అవసరమైతే వైద్య సలహా.. ఇవన్నీ కలిసే నోటి దుర్వాసనకు శాశ్వత పరిష్కారం చూపుతాయి.