పెరుగును ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే షాకే..

ఫ్రిజ్ రాకముందు పెరుగు అంటే ఒక అమృతంతో సమానం. కానీ ఇప్పుడు అది కేవలం ఒక డెయిరీ ప్రొడక్ట్‌లా మారిపోయింది. పులవకూడదనే నెపంతో మనం చేసే చిన్న తప్పు, పెరుగులోని అద్భుతమైన పోషకాలను నాశనం చేస్తోంది. పెరుగును ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల కలిగే నష్టాలేంటి..? అది విషతుల్యంగా మారుతుందా..? సైన్స్, ఆయుర్వేదం ఏం చెబుతున్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగును ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే షాకే..
Side Effects Of Storing Curd In Fridge

Updated on: Jan 15, 2026 | 7:41 AM

పెరుగు.. భారతీయుల భోజనంలో ఇది లేకపోతే ముద్ద దిగదు. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లతో నిండిన పెరుగు ఆరోగ్యానికి మేలు చేసే ఒక ప్రోబయోటిక్ ఆహారం. అయితే మారుతున్న కాలంతో పాటు మనం పెరుగును నిల్వ చేసే పద్ధతి కూడా మారింది. పెరుగు పులవకుండా ఉండాలని చాలామంది వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పెరుగులోని అసలైన గుణాలు నశించిపోతాయని మీకు తెలుసా?

ఫ్రిజ్‌లో పెడితే ప్రోబయోటిక్ పవర్ ఖతం

పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అయితే పెరుగును అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఈ మేలు చేసే బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంది. ఫలితంగా మీరు పెరుగు తిన్నా అది కేవలం రుచిని మాత్రమే ఇస్తుంది కానీ శరీరానికి అందాల్సిన రోగనిరోధక శక్తిని లేదా జీర్ణక్రియ ప్రయోజనాలను అందించదు.

నాణ్యత – పోషకాలు దెబ్బతింటాయి

పోషకాల తగ్గుదల: ఫ్రిజ్‌లోని చల్లదనం పెరుగులోని పోషక విలువలను తగ్గిస్తుంది. ఇది కేవలం మీ ఆకలిని తీర్చడానికే తప్ప, శరీర పుష్టికి ఉపయోగపడదు.

వింత వాసన: ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు అందులోని ఇతర ఆహార పదార్థాల వాసన పెరుగుకు పట్టే అవకాశం ఉంది. అలాగే గాలి ఆడని ఫ్రిజ్‌లో పెరుగు ఒక రకమైన వింత వాసనను వెదజల్లుతుంది.

రుచిలో మార్పు: ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు పైన నీరు పేరుకుపోవడం, పెరుగు గడ్డలా మారడం వంటి మార్పులు జరుగుతాయి. ఇది సహజమైన పెరుగు రుచిని దెబ్బతీస్తుంది.

బయట ఉంచితేనే మేలు

చాలామంది పెరుగు పులైపోతుందని భయపడతారు. కానీ సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పెరుగును ఒక మట్టి పాత్రలో లేదా స్టీలు పాత్రలో ఉంచితే అది రెండు రోజుల వరకు తాజాగా ఉంటుంది. మట్టి పాత్రలో నిల్వ చేస్తే పెరుగులోని అదనపు నీటిని అది పీల్చుకుని, పెరుగును మరింత గట్టిగా, తియ్యగా ఉంచుతుంది.

చిట్కాలు

  • ఎప్పటికప్పుడు తాజాగా తోడు పెట్టుకున్న పెరుగును తినడం ఉత్తమం.
  • ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే చల్లటి పెరుగు తినడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆస్తమా లేదా సైనస్ సమస్యలు ఉన్నవారు ఫ్రిజ్ పెరుగుకు దూరంగా ఉండాలి.
  • ఆయుర్వేదం ప్రకారం పెరుగును వేడి చేయకూడదు, అతిగా చల్లగా తీసుకోకూడదు. సహజ స్థితిలో ఉన్నప్పుడే అది శరీరానికి బలాన్నిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..