
కుక్కర్ విజిల్ రాకపోవడానికి 90% కారణం దాని మూతకు ఉండే రబ్బరు రింగ్ లేదా గ్యాస్కెట్ పాడైపోవడమే. ఇది పాతబడటం వల్ల లేదా వదులుగా మారడం వల్ల లోపల ఉండాల్సిన ఆవిరి పక్కల నుండి బయటకు పోతుంది. దీనివల్ల విజిల్ రావడానికి సరిపడా ప్రెషర్ లోపల తయారవ్వదు. అంతేకాదు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి.. అవేంటో చూసేయండి..
2. వెయిట్ (విజిల్) లో వ్యర్థాలు పేరుకుపోవడం:
విజిల్ లోపల ఉండే చిన్న రంధ్రంలో ఆహార పదార్థాలు (పప్పు లేదా అన్నం మెతుకులు) చిక్కుకుపోవడం వల్ల ఆవిరి బయటకు రాలేకపోతుంది. విజిల్ పైన ఉండే రంధ్రం బ్లాక్ అయితే విజిల్ పైకి లేవదు.
3. సేఫ్టీ వాల్వ్ సమస్య:
కుక్కర్ మూతకు ఉండే చిన్న సేఫ్టీ వాల్వ్ సరిగ్గా లేకపోయినా లేదా అది లూజ్ అయినా ఆవిరి అక్కడి నుంచే లీక్ అవుతుంది. దీనివల్ల ప్రెషర్ విజిల్ వరకు చేరదు.
4. కుక్కర్ అంచులకు దెబ్బలు తగలడం:
ఒక్కోసారి కుక్కర్ లేదా దాని మూత కింద పడటం వల్ల అంచులు వంగిపోతాయి. ఇలా జరిగినప్పుడు మూత సరిగ్గా కూర్చోదు. చిన్న గ్యాప్ ఉన్నా ఆవిరి బయటకు పోతుంది తప్ప విజిల్ రాదు.
5. తగినంత నీరు లేకపోవడం:
కుక్కర్‌లో తగినంత నీరు పోయకపోతే ఆవిరి తయారవ్వదు. నీరు తక్కువైతే లోపల పదార్థం మాడిపోయే అవకాశం ఉంటుంది తప్ప విజిల్ రాదు.
పరిష్కార మార్గాలు – చిన్న చిట్కాలు:
రబ్బరును సరిచేయండి: మీ కుక్కర్ రబ్బరు కొంచెం వదులుగా అనిపిస్తే, దానిని తీసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి మళ్ళీ వాడండి. అప్పటికీ తగ్గకపోతే కొత్త గ్యాస్కెట్ మార్చడం ఉత్తమం.
రంధ్రాన్ని క్లీన్ చేయండి: విజిల్ పెట్టే రంధ్రాన్ని ఒక చిన్న పిన్ను లేదా పుల్లతో క్లీన్ చేయండి. అందులో ఏవైనా అడ్డుపడితే విజిల్ రాదు.
మూతను చెక్ చేయండి: మూత పెట్టిన తర్వాత సైడ్స్ నుండి ఆవిరి వస్తుందో లేదో గమనించండి. సైడ్ నుండి లీక్ అయితే మూతను సరిగ్గా అమర్చండి.
ముఖ్య గమనిక: కుక్కర్ విజిల్ రానప్పుడు బలవంతంగా మూత తీయడానికి ప్రయత్నించకండి. స్టవ్ ఆపి, ప్రెషర్ అంతా పోయే వరకు వేచి ఉండండి.