మినరల్ వాటర్‌లో మినరల్స్ లేవట!

| Edited By:

Mar 03, 2020 | 9:05 PM

హెల్త్‌కి మంచిది కదా అని మీరు రోజూ మినరల్ వాటర్ తాగుతున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మినరల్ వాటర్ తాగే కన్నా.. కుండ నీరు తాగడమే..

మినరల్ వాటర్‌లో మినరల్స్ లేవట!
Follow us on

హెల్త్‌కి మంచిది కదా అని మీరు రోజూ మినరల్ వాటర్ తాగుతున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మినరల్ వాటర్ తాగే కన్నా.. కుండ నీరు తాగడమే మంచిదంటున్నారు వైద్యులు. ఇంట్లో వాడే మంచినీటిని కాచి చల్లార్చి.. ఓ రాగి పాత్ర లేదా కుండలో పోసి ఆ నీరు తాగడమే సేఫ్ అంటున్నారు. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, తద్వారా హెల్దీగా ఉంటారన్నారు.

కానీ మినరల్ వాటర్.. మంచివికదా అని నిరంతరం అవే తాగడం వివిధ జబ్బులకు తావిస్తుందంట. ఎందుకంటే శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ వంటివి మినరల్ వాటర్‌లో దొరకవు. తక్కువ వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తాయి. అందులోనూ అవి ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ క్యాన్లలో వచ్చే నీటిని తాగకపోవడమే బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పేరుకే అవి మినరల్ వాటర్ కానీ.. ఆ నీటిలో ఏవీ ఉండవంటున్నారు. అదే కుండనీరు తాగితే.. ఎముకలకు అందాల్సిన కాల్షియం సరిగ్గా అందుతుందన్నారు.

మినరల్ వాటర్ తాగితే వచ్చే వ్యాధులు:

1. ఎముకల్లో బలహీనత ఏర్పడటం
2. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం
3. రోగ నిరోధక శక్తి తగ్గడం
4. మోకాళ్ల నొప్పులు రావడం
5. శరీరానికి అందాల్సిన మినరల్స్ అందకపోవడం