
మన శరీరానికి ఆహారం అత్యంత అవసరమైన ప్రాథమిక అవసరం. నీటిలాగే ఆహారం కూడా మన శరీరాన్ని చురుకుగా, శక్తివంతంగా ఉంచుతుంది. కానీ చాలామందిలో ఒక సాధారణ సమస్య కనిపిస్తుంది — ఆకలిగా ఉన్నప్పుడు చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం. దీనిని Hangry (Hungry + Angry) అని కూడా అంటారు. ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఆకలిగా ఉన్నప్పుడు కోపం ఎందుకు వస్తుంది? మనం కొంతసేపు ఆహారం తీసుకోకపోతే, శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. గ్లూకోజ్ అనేది మెదడుకు ముఖ్యమైన ఇంధనం. ఈ స్థాయి తగ్గినప్పుడు మెదడు సరిగా పనిచేయదు. శక్తి తగ్గుతుంది. మూడ్ మారుతుంది. చిరాకు పెరుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరం ఒత్తిడి హార్మోన్లు విడుదల చేస్తుంది. కార్టిసాల్ (Cortisol) – ఒత్తిడిని పెంచే హార్మోన్, నలిన్ (Adrenaline) – శరీరాన్ని fight or flight స్థితికి తీసుకెళ్తుంది. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల మనకు ఆకలిగా ఉన్నప్పుడు కోపం, అసహనం ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ లక్షణాలు అన్నీ శరీరానికి ఆహారం అవసరం అనే సంకేతాలు.
గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు మెదడులోని భావోద్వేగాలను నియంత్రించే భాగం ప్రభావితమవుతుంది. దాని వల్ల భావోద్వేగ నియంత్రణ తగ్గుతుంది. చిన్న విషయాలకే ఎక్కువ రియాక్షన్ వస్తుంది. మానసిక స్థితి త్వరగా మారుతుంది. దీని ఫలితంగా కోపం మరియు అసహనం పెరుగుతాయి.
పొడవుగా ఆకలిగా ఉండకుండా సమయానికి భోజనం చేయడం ముఖ్యం. ఒకేసారి ఎక్కువ తినకుండా, చిన్న చిన్న మోతాదుల్లో తినడం మంచిది. ఆరోగ్యకరమైన స్నాక్స్ అంటే పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. డీహైడ్రేషన్ కూడా చిరాకుకు కారణమవుతుంది. ప్రతి గంటకు నీరు తాగడం మంచిది. జంక్ ఫుడ్ తాత్కాలిక శక్తి ఇచ్చినా, తర్వాత అలసట మరియు మూడ్ స్వింగ్స్ పెంచుతుంది.