నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే అందం, ఆరోగ్యం రెండూ మీవే! ఈ రహస్యం తెలిస్తే..

Weight loss without non veg: మాజీ మిస్ శ్రీలంక, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శాఖాహారిగా మారిన తర్వాత ఆమె శరీరంలో వచ్చిన సానుకూల మార్పులను పంచుకున్నారు. మాంసాహారం మానేయడం వల్ల మొటిమలు తగ్గడం, బరువు స్థిరంగా ఉండటం, కడుపు ఉబ్బరం తగ్గడం, మానసిక ప్రశాంతత వంటి ప్రయోజనాలు పొందారు. ప్రోటీన్ కోసం ఆమె కూరగాయలు, బీన్స్, టోఫు, ప్రోటీన్ షేక్స్ తీసుకుంటున్నారు. సరైన పోషకాలతో శాఖాహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే అందం, ఆరోగ్యం రెండూ మీవే! ఈ రహస్యం తెలిస్తే..
Quit Non Veg For Protein

Updated on: Dec 25, 2025 | 10:20 AM

శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పొందడానికి మాంసాహారం మాత్రమే తినాల్సిన పనిలేదు..మీరు శాఖాహారంతో కూడా మంచి ప్రోటీన్‌ తీసుకోవచ్చు. మాజీ మిస్ శ్రీలంక యూనివర్స్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక ఇంటర్వ్యూలో తాను ఇప్పుడు పూర్తి శాఖాహారిగా మారానని, మాంసాహార పదార్థాలను పూర్తిగా వదులుకున్నానని వెల్లడించారు. ఈ నటి బాలీవుడ్‌లో చాలా ఫేమస్‌ అయ్యారు. గ్లామర్ ప్రపంచంలోని అందాల తారలలో తను కూడా ఒకరు. ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో విశేషాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..మాంసాహార వంటకాలను మానేసిన తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పులను, ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు తన ఆహారంలో ఎలాంటి శాఖాహార పదార్థాలను (non veg to vegetarian benefits) చేర్చుకున్నారో కూడా వివరించారు. మాంసాహారం నుండి శాఖాహారానికి మారిన తర్వాత శరీరంలో సంభవించే మార్పులేంటో తన మాటల్లోనే చూద్దాం…

మొటిమలు పోయాయి – మాంసాహారం మానేసిన తర్వాత ముఖంలో తరచూ వచ్చే మొటిమల సమస్య తగ్గిపోయింది. శాఖాహారిగా మారడం అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చింది.

బరువుపై ప్రభావం – బరువులో హెచ్చుతగ్గులు ఆగిపోయాయి. శాఖాహారం తినడం వల్ల శరీరం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఉబ్బరం తగ్గుతుంది – ఎప్పుడూ కడుపు ఉబ్బరం అనిపించదు. ఇది మాంసాహారం తినేటప్పుడు తరచుగా జరుగుతుంది.

మనస్సు కూడా తేలికగా ఉంటుంది – మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల మానసికంగా తేలికగా, ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు, ఆమె శాఖాహారిగా మారింది.

ఇవి మాత్రమే కాదు.. నాన్-వెజ్ మానేయడం వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నాన్‌ వెజ్‌కి దూరంగా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. పూర్తి పోషకాలు తీసుకోవడం వల్ల మెరుగైన జీర్ణ వ్యవస్థ కలిగి ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుదల తగ్గుతుంది.

ప్రోటీన్ లోపాన్ని ఎలా అధిగమించాలి?

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి అన్ని రకాల కూరగాయలు, బీన్స్ తింటున్నారు. టోఫు కూడా తింటున్నారట. తరచూ ప్రోటీన్ షేక్స్ కూడా తాగుతున్నారు.

ఈ విషయాలపై శ్రద్ధ వహించండి ..

మీ ఆహారంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, కాల్షియం, జింక్ వంటి తగినంత పోషకాలను చేర్చుకోవడానికి ప్రయత్నించండి.

శాఖాహార ఆహారం పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల, శరీరంలో దాని లోపం ఉండవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..