కొబ్బరి పాలతో ఎన్ని లాభాలో తెలుసా..? మీరూ ఓ లుక్కేయండి.. వెంట‌నే మొద‌లు పెడ‌తారు..

కొబ్బ‌రిని మిక్సీలో వేసి బాగా పిండి దాన్నుంచి కొబ్బ‌రి పాల‌ను త‌యారు చేస్తారు. ఇలా త‌యారు చేసిన కొబ్బ‌రిపాల‌ను వంట‌ల్లో ఎక్కువగా ఉప‌యోగిస్తారు. అయితే, ఈ కొబ్బరి పాల వల్ల కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా..? అవును కొబ్బరి పాల వల్ల బోలెడన్నీ బెనిఫిట్స్‌ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బ‌రిపాల‌ను తాగడం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. శ‌రీరం ఇన్‌ఫెక్ష‌న్ల‌ను, రోగాలను దరిచేరకుండా చేస్తుంది. కొబ్బరి పాల వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

కొబ్బరి పాలతో ఎన్ని లాభాలో తెలుసా..? మీరూ ఓ లుక్కేయండి.. వెంట‌నే మొద‌లు పెడ‌తారు..
Coconut Milk

Updated on: Nov 08, 2025 | 9:18 PM

కొబ్బ‌రిపాలలో అనేక పోష‌కాలు ఉంటాయి. కొబ్బ‌రిపాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల అనేక వ్యాధులను న‌యం చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రిపాల‌తో శ‌రీరానికి త‌క్ష‌ణ‌ శ‌క్తి ల‌భిస్తుంది. చురుగ్గా ప‌నిచేస్తారు. కొబ్బ‌రిపాల‌ను ఒక క‌ప్పు మోతాదులో తీసుకుంటే సుమారుగా 400 క్యాల‌రీల మేర శ‌క్తి ల‌భిస్తుంది. కొవ్వు 40 గ్రాములు, పిండి ప‌దార్థాలు 13 గ్రాములు, ప్రోటీన్లు 5 గ్రాములు, ఫైబ‌ర్ 5 గ్రాములు, స్వ‌ల్ప మొత్తాల్లో విట‌మిన్ సి, ఫోలేట్‌, విట‌మిన్లు డి, ఎ, బి12 ఉంటాయి.

కొబ్బ‌రిపాల‌లో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజ‌రైడ్స్ మ‌న శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చ‌యి కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. కొబ్బ‌రిపాల‌లో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజ‌రైడ్స్ ఆక‌లిని నియంత్రిస్తాయి. కొవ్వు క‌ర‌గ‌డాన్ని ప్రోత్స‌హిస్తాయి. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగేలా చేస్తాయి. దీంతో బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. కొబ్బరి పాలలో మాంగ‌నీస్‌, కాప‌ర్‌, మెగ్నిషియం, ఐర‌న్‌, ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, సెలీనియం వంటి మిన‌ర‌ల్స్ కూడా స‌మృద్ధిగా ఉంటాయి. వ్యాయామం చేసే వారు లేదా శారీర‌క శ్ర‌మ చేస్తున్న వారు బాగా అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటే కొబ్బ‌రి పాల‌ను తాగాలి. దీంతో శ‌క్తి ల‌భించి మ‌ళ్లీ ఉత్సాహంగా మారుతారు.

కొబ్బరి పాల‌లో ఉండే లారిక్ యాసిడ్ యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. కొబ్బ‌రిపాల‌ను సేవిస్తుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. రోగాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. కొబ్బ‌రిపాల‌లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు కూడా ఉంటాయి. అనేక ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు, యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఈ పాల‌లో ఉంటాయి. కొబ్బరి పాలలోని ఔషధ గుణాలు శ‌రీరంలోని వాపులు, నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. క‌నుక ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో ఉప‌శ‌మనం ల‌భిస్తుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బ‌రిపాల‌లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి.వీటిలో విట‌మిన్లు ఎ, డి, ఇ, కె క‌రుగుతాయి. దీని వ‌ల్ల శ‌రీరానికి ఆయా పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. జీర్ణ‌క్రియ‌కు కావ‌ల్సిన ఎంజైమ్ ల ఉత్ప‌త్తి స‌రిగ్గా ఉంటుంది. శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఏర్ప‌డే వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. కొబ్బ‌రిపాల‌లో ఉండే ఐర‌న్ మ‌న శ‌రీరంలో ర‌క్తం త‌యార‌య్యేలా చేస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ఇలా కొబ్బ‌రిపాల‌ను సేవించ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..