Weight Loss: వ్యాయామం, డైటింగ్ లేకుండానే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..

|

Jun 25, 2022 | 6:13 AM

కొన్నిసార్లు జిమ్, డైటింగ్ క్రమం తప్పకుండా చేయడం కష్టం. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

Weight Loss: వ్యాయామం, డైటింగ్ లేకుండానే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
Weight Loss Tips
Follow us on

Weight Loss Diet: ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లలో గంటల తరబడి వ్యాయామం చేస్తుంటారు. కొంతమంది పలు రకాల డైటింగ్‌లను కూడా అనుసరిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు జిమ్, డైటింగ్ క్రమం తప్పకుండా చేయడం కష్టం. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. ఇది మీ బరువును క్రమంగా తగ్గిస్తుంది. అధిక బరువుకు చెక్ పెట్టాలంటే.. ఆహారం, పానీయాలలో కొన్నింటిని చేర్చుకోవడం మంచిది. ఇవి బరువు తగ్గడాన్ని చాలా సులభం చేస్తాయి. స్థూలకాయాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువును ఇలా తగ్గించుకోండి..

  • ముందుగా అల్పాహారంలో ఓట్స్ లేదా గంజి లాంటి తినండి. దీనితోపాటు ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలు, పండ్లు తినవచ్చు.
  • బరువు తగ్గడానికి ఎటువంటి కఠినమైన డైటింగ్‌లను అనుసరించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.
  • ప్రతి మూడు గంటలకు ఒకసారి ఏదైనా కొంత తినాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్ లేదా మరేదైనా భోజనం చేయవచ్చు.
  • రెండు భోజన సమయాల మధ్య ఆకలిగా అనిపిస్తే మీరు మధ్యాహ్న భోజనంగా పండ్లు తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీరు లేదా బ్రౌన్ బ్రెడ్ శాండ్‌విచ్‌ని తినవచ్చు.
  • రోటీలో మల్టీగ్రెయిన్ పిండిని ఉపయోగిస్తారు. కావున తృణధాన్యాలు తినడానికి ప్రయత్నించండి. ఎక్కువ పండ్లు, కూరగాయలు లాంటి తినండి.
  • జొన్నలు, మిల్లెట్, రాగి పిండి రోటీలు తినండి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.
  • శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి. రోజంతా నీరు పుష్కలంగా తాగాలి. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, చక్కెర లేకుండా జ్యూస్ వంటి ఇతర పానీయాలు తీసుకోవచ్చు.
  • రోజూ కొన్ని తృణధాన్యాలు తినండి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..