Weight Loss Tips: రోజూ ఇవి తింటే వారంలో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..

|

Jun 22, 2022 | 6:08 AM

బరువు తగ్గేందుకు వ్యాయామంతోపాటు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.. ఫైబర్‌తో పాటు, బరువు తగ్గడానికి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి.

Weight Loss Tips: రోజూ ఇవి తింటే వారంలో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..
Weight Loss Tips
Follow us on

Protein Foods For Weight Loss: ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు పలు రకాల డైట్లతోపాటు.. ఎక్సర్‌సైజ్ లాంటివి చేస్తున్నారు. స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించడానికి నిత్యం చెమటోడుస్తుంటారు. అయితే.. బరువు తగ్గేందుకు వ్యాయామంతోపాటు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.. ఫైబర్‌తో పాటు, బరువు తగ్గడానికి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. ఇలా చేయడం వల్ల బరువు ఆరోగ్యకరంగా తగ్గవచ్చు. బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..

బరువు తగ్గేందుకు ఈ ఆహారాలను తీసుకోండి..

పాలకూర: ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే.. పాలకూర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనిలో ప్రొటీన్లు, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. అందువల్ల ప్రతిరోజూ పాలకూరను తీసుకుంటే అది బరువు తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం పాలకూర రసం, పాలకూర సూప్, పాలకూర సలాడ్ లేదా కూరను ఆహారంలో చేర్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

శెనగలు: శెనగలు ప్రోటీన్‌కు మంచి మూలం. ఇది కాకుండా దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శెనగలు తిన్న తర్వాత కడుపు చాలాసేపు నిండుగా ఉంటుంది. ఆకలి వేయదు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో శెనగలు తిన్న తర్వాత అతిగా తినడాన్ని కూడా నివారించవచ్చు. శెనగలను మొలకలు, లేదా వేయించి లేదా సలాడ్, కూర రూపంలో తీసుకోవచ్చు.

పెరుగు: పెరుగులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగు జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీంతోపాటు ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..