Which Habits Affect Weight Loss Journey: ఆధునిక కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు ఆహారం నుంచి పలు రకాల వ్యాయామాలను అనుసరిస్తున్నారు. కానీ.. ప్రతిదీ అనుసరించిన తర్వాత కూడా బరువు లేదా ఊబకాయం సమస్య తగ్గదు. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలోని కొన్ని అలవాట్లని నిపుణులు పేర్కొంటున్నారు. బరువు తగ్గే సమయంలో మనం ప్రతిరోజూ అనేక తప్పులు చేస్తుంటాం. ఇది మన బరువు తగ్గకుండా ఆటంకం కలిగిస్తుంది. బరువు తగ్గేటప్పుడు ఎలాంటి విషయాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకోండి..
బరువు తగ్గేటప్పుడు ఈ తప్పులు చేయడం మానుకోండి..
భోజనం చేసేటప్పుడు టీవీ చూడటం లేదా మొబైల్‌కి అతుక్కుపోవడం
ప్రజలు ప్రతిరోజూ చేసే అత్యంత సాధారణ తప్పులలో ఇది ఒకటి. ఇది చాలా మంది అనుసరించే చాలా చెడ్డ అలవాటని డైటిస్టులు పేర్కొంటున్నారు. టీవీ చూస్తూ లేదా మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు ఆహారం తినడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఎక్కువ ఆహారం లేదా క్యాలరీలు తీసుకోవడం వల్ల మీ బరువు ఇంకా పెరుగుతుంది.అందుకే భోజనం చేసే సమయంలో ఆహారం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. భోజనం చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
చాలా త్వరగా తినడం..
ఆహారాన్ని ఎప్పుడూ కూడా తొందరపడి తీనకూడదు. ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినాలి. ఎందుకంటే పొట్ట నిండుగా మారిందన్న సంకేతాలను మీ మెదడు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. వేగంగా తింటే.. చాలా త్వరగా తింటారు. దీని వల్ల మీ ఆకలి తీరదు. ఎందుకంటే మీ కడుపు నిండిన సిగ్నల్ మెదడుకు చేరదు. ఈ విధంగా మీరు ఎక్కువ తింటారు.. ఎక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల బరువు మరింత పెరుగుతారు.
తగినంత నిద్రపోకపోవడం..
తగినంత నిద్ర లేనప్పుడు ఇది ఆకలిని అదుపులో ఉంచడానికి అవసరమైన లెప్టిన్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. శరీరంలో ఈ హార్మోన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు, మీరు మరింత ఆకలితో ఉంటారు. దీంతో ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరగడం ప్రారంభమవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..