
మంచి నిద్రకోసం ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి మేల్కొనే విధంగా షెడ్యూల్ ఫాలో అవ్వటం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారను. ఇలా నిర్థిష్ట షెడ్యూల్ ఫాలో అయితే నిద్రలేమి సమస్య ఉండదని చెబుతున్నారు. దాంతో పాటుగా, రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్ర పోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం ముగించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, రాత్రిపూట టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, కేకులు తీసుకోకూడదు. వీటిలోని చక్కెర, కెఫిన్ నిద్రకు భంగం కలిగిస్తాయి. దాంతో పాటుగా నిద్రకు ఉపక్రమించే ముందు ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తి చేసే మెలటోనిన్ హార్మోన్ బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
ముఖ్యంగా నిద్రకు ముందు వరకు టీవీ, ఫోన్, ల్యాప్టాప్ మొదలైన వాటితో రాత్రిపూట ఎక్కువ సమయం గడపవద్దు అని చెబుతున్నారు.. ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రకు భంగం కలిగిస్తుందని అంటున్నారు. బెడ్‌రూమ్ వాతావరణంమీ బెడ్‌రూమ్ తాలూక వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. చల్లగా, డార్క్‌గా ఉంటే నిద్ర బాగా పడుతుంది.
ప్రతిరోజూ ఉదయం కొంత సమయం క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే నిద్రలేమి సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల కూడా ప్రశాంతమైన గాఢ నిద్ర, ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..