
నడక, పరుగు రెండూ బరువు తగ్గడానికి సహాయపడే అద్భుతమైన కార్డియో వ్యాయామాలు. అయితే, బరువు తగ్గడం విషయానికి వస్తే చాలా మంది తరచుగా తమకు ఏది మంచిదో ఆలోచిస్తారు. నడక అనేది తక్కువ ప్రభావ వ్యాయామం, అంటే ఇది కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగించదు. అలాగే ఇది సులభమైన ప్రక్రియ, కారీ రన్నింగ్ అనేది కాస్తా శారీరక శ్రమతో కూడుకున్నది. నడక అనేది ఎవరైనా ఎక్కడైనా చేయగలిగే వ్యాయామం, దీనికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు, దీన్ని మనం ఈజీగా అలవాటు చేసుకోవచ్చు. పరుగెత్తడం కంటే నడక తక్కువ కేలరీలను బర్న్ చేసినప్పటికీ క్రమం తప్పకుండా నడవడం వల్ల బరువు తగ్గవచ్చు. అందువల్ల, మీరు సులభమైన, తక్కువ శ్రమతో కూడిన వ్యాయామం కోసం చూస్తున్నట్లయితే, నడక ఉత్తమ ఎంపిక.
బరువు తగ్గడానికి రన్నింగ్ ఎలా సహాయపడుతుంది
పరుగు అనేది అధిక-ప్రభావవంతమైన, అధిక-తీవ్రత కలిగిన వ్యాయామం, ఇది నడక కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. వేగంతో నడవడం లేదా జాగింగ్ చేయడం ద్వారా, మీ శరీరం ఎక్కువ శ్రమను కలిగిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పరుగు ఎక్కువ కేలరీలను బర్న్ చేయడమే కాకుండా మీ కండరాలను, ముఖ్యంగా మీ కాళ్ళు, తొడలలోని కండరాలను కూడా సక్రియం చేస్తుంది. ఇది బలం, ఓర్పు రెండింటినీ పెంచుతుంది. ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పరుగెత్తడం కొంచెం సవాలుగా అనిపించినప్పటికీ, దాని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, పరుగెత్తడం ఆపిన తర్వాత కూడా శరీరం కేలరీలను బర్న్ చేస్తూనే ఉంటుంది, అందుకే బరువు తగ్గేందుకు నడక కంటే రన్నింగ్ కొద్దిగా ప్రయోజనకరంగా ఉంటుంది.
మరి బొడ్డు కొవ్వు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది చేయాలి?
నడక, పరుగు రెండూ బరువు తగ్గడానికి, బొడ్డు కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి. మీరు వ్యాయామానికి కొత్తవారు అయితే కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే లేదా మితమైన వ్యాయామాన్ని ఇష్టపడితే మీకు నడక మంచి ఎంపిక అవుతుంది. అలా కాదు మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే రన్నింగ్ అనేది మీకు మంచి ఎంపిక. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీరు దేన్నైనా ఎంచుకోవచ్చు. అయితే, ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు మీరు మీ ఫిట్‌నేస్‌ను దృష్టిలో ఉంచుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.