Astro Tips for Mobile Phone: మొబైల్‌ను ఈ దిశలో పెట్టుకుని నిద్రపోతున్నారా..? నిద్ర, శక్తి, కెరీర్ ప్రభావితం కావచ్చు..

ప్రస్తుతం మనిషికి తినడానికి తిండి లేకపోయినా ఒకే కానీ చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే జీవించడం ఎలా అన్న పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ చూస్తూ.. దానిని తమ దగ్గరగా పెట్టుకుని నిద్రపోవదమో.. లేక రాత్రి ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచి దిండు దగ్గర పెట్టుకుని నిద్రపోవడమో చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వలన నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుందని, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందని తెలుసా.. రాత్రి ఎక్కడ ఏ దిశలో సెల్ ఫోన్ పెట్టుకోవడం మంచిదంటే..

Astro Tips for Mobile Phone: మొబైల్‌ను ఈ దిశలో పెట్టుకుని నిద్రపోతున్నారా..? నిద్ర, శక్తి, కెరీర్ ప్రభావితం కావచ్చు..
Astro Tips For Mobile Phone
Image Credit source: social media

Updated on: Jun 06, 2025 | 4:02 PM

నేటి ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. అది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మన దైనందిన జీవితంలోని అనేక పనులను చేయడానికి మనం మొబైల్ ఫోన్‌పై ఆధారపడుతున్నాం. అది సమాచారం పొందడానికి అయినా, ఫోటోలు, వీడియోలు, ఆన్‌లైన్‌లో పని చేయడం లేదా డబ్బుకు సంబంధించిన ఏదైనా లావాదేవీలైనా.. ఇలా ప్రతి పని చిన్న పని.. పెద్ద పని అనే తేడా లేకుండా మొత్తం పనులన్నీ ఈ చిన్న పరికరం ద్వారా చేస్తున్నారు. సెల్ ఫోన్ ను వాడడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మరోవైపు దీని వలన కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మీరు మొబైల్ ఫోన్‌ను ఇంట్లో తప్పు దిశలో ఉంచితే.. అది మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఫోన్‌ను తప్పు దిశలో ఉంచితే దాని శక్తి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఇంటి నైరుతి భాగంలో ఉంచడం హానికరమని భావిస్తారు. ఎందుకంటే ఈ దిశ స్థిరత్వం , భద్రతతో ముడిపడి ఉంటుంది.

మీరు ఫోన్ మీకు ప్రయోజనకరంగా ఉండాలని కోరుకుంటే.. దానిని సరైన దిశలో ఉంచండి. మీరు ఉద్యోగస్థులైతే, మొబైల్‌ను ఉత్తర దిశలో ఉంచుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దిశ మానసిక స్పష్టత, పని విజయంతో ముడిపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మీరు వీడియో మేకింగ్, డిజైనింగ్ లేదా కంటెంట్ క్రియేషన్ వంటి సృజనాత్మక రంగంలో ఉంటే.. ఫోన్‌ను పశ్చిమ దిశలో ఉంచడం మంచిది. ఇలా చేయడం వలన కెరీర్‌లో కొత్త అవకాశాలను తెస్తుంది.

ఫోన్‌ను దక్షిణ దిశలో ఉంచడం వల్ల మీ నిద్రపోయే ప్రదేశానికి సెల్ ఫోన్ కి మధ్య కొంత దూరం ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. ఫోన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

అయితే మొబైల్‌ను ‘సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్’ అంటే దక్షిణ-పశ్చిమానికి దక్షిణ దిశలో ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. మానసిక సమతుల్యత , సామర్థ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

అంతేకాదు రాత్రి సమయంలో ఫోన్‌ను తల దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని దానిని ఛార్జింగ్‌లో పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి సమయంలో ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఛార్జ్ చేయండి. మీరు నిద్రించే మంచం నుంచి కొంత దూరంలో ఉంచడం మంచిది

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు