Kitchen Hacks: కుక్కర్ నుంచి వాటర్ లీకేజ్ ఆగాలంటే ఈ ట్రిక్స్ ట్రై చేయండి..

ఇంట్లో ఒక్క ప్రెజర్ కుక్కర్ ఉన్నా వంట పని మొత్తం ఈజీగా అయిపోతుంది అన్న విషయం చాలా మందికి తెలుసు. అందుకే చాలా మంది ఎక్కువగా కుక్కర్ ఉపయోగిస్తూ ఉంటారు. మటన్ లాంటివి కూడా కుక్కర్ లో వేస్తే 6, 7 విజిల్స్‌కి ఉడికిపోతుంది. సాధారణంగా ఎక్కువగా కుక్కర్‌లో పప్పు లేదా అన్నం అనేవి ఎక్కువగా కుక్ చేస్తాం. అయితే ఒక్కోసారి కుక్కర్ విజిల్ నుంచి వాటర్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య ఏదో ఒక సమయంలో మిమ్మల్ని ఇబ్బంది..

Kitchen Hacks: కుక్కర్ నుంచి వాటర్ లీకేజ్ ఆగాలంటే ఈ ట్రిక్స్ ట్రై చేయండి..
Kitchen Hacks
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 21, 2024 | 7:40 PM

ఇంట్లో ఒక్క ప్రెజర్ కుక్కర్ ఉన్నా వంట పని మొత్తం ఈజీగా అయిపోతుంది అన్న విషయం చాలా మందికి తెలుసు. అందుకే చాలా మంది ఎక్కువగా కుక్కర్ ఉపయోగిస్తూ ఉంటారు. మటన్ లాంటివి కూడా కుక్కర్ లో వేస్తే 6, 7 విజిల్స్‌కి ఉడికిపోతుంది. సాధారణంగా ఎక్కువగా కుక్కర్‌లో పప్పు లేదా అన్నం అనేవి ఎక్కువగా కుక్ చేస్తాం. అయితే ఒక్కోసారి కుక్కర్ విజిల్ నుంచి వాటర్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య ఏదో ఒక సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉంటుంది. చాలా మంది ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే ఉంటారు. విజిల్ కూడా ఒక్కోసారి సరిగా రాదు. ఇలాంటి సమయంలో అన్నం లేదా పప్పు వంటివి ఉడకకపోవడమో లేదా మాడిపోవడమో జరుగుతుంది. ఆ తర్వాత వీటిని శుభ్రం చేయడం కూడా కష్టం అవుతుంది. మరి కుక్కర్ నుంచి వాటర్ లీకేజ్ కావొద్దంటే ఇలా చేయండి. ఈ చిట్కాలు ట్రై చేయండ వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వాటర్ తక్కువగా వేయాలి:

చాలా మంది కొలవకుండానే వాటర్ అనేది అంచనాగా పోసేస్తారు. దీని వల్ల నీరు అనేది ఎక్కువ అవుతుంది. ఈ నీటిని కుక్కర్ విజిల్ ద్వారా ఒక్కటే సారి పంపిస్తుంది. దీని వల్ల ఫుడ్ మాడిపోవడం, గ్యాస్ పాడవ్వడం లేదా కుక్కర్ మాడిపోవడం జరుగుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. ముందు సరైన మొత్తంలోనే నీటిని వేయండి.

పెద్ద మంట పెట్టవద్దు:

మీరు నీటిని ఎక్కువగా పోసారని మీకు అనిపిస్తే.. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టకండి. దీని వల్ల ఒక్కటేసారి వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి. మీడియం మంటలో ఓ రెండు, మూడు విజిల్స్ తెప్పిస్తే సరిపోతుంది. అలాగే మొదటి విజిల్ నుంచి వాటర్ ఎక్కువగా వచ్చాయంటే.. వెంటనే మంటను సిమ్‌లో పెట్టండి.

ఇవి కూడా చదవండి

కుక్కర్ రబ్బర్ చెక్ చేయండి:

అలవాటులో పొరపాటులాగా ఒక్కోసారి కుక్కర్‌కి ఉండే రబ్బర్ సరిగా పెట్టకుండానే మూతపెడుతూ ఉంటారు. కాబట్టి కుక్కర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకోవాలి. రబ్బర్ సరిగా లేకపోయినా కూడా వాటర్ లీక్ అవుతుంది.

విజిల్ శుభ్రం చేయండి:

చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. కుక్కర్ క్లీన్ చేస్తారు. కానీ విజిల్ క్లీన్ చేయరు. విజిల్ సరిగా క్లీన్ చేయక పోవడం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..