Panner Gravy Curry: ఎందులోకైనా అదిరిపోయే పన్నీర్ గ్రేవీ కర్రీ..

కార్తీక మాసాలే కాదు చాలా మంది శ్రావణ మాసాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ నెల అంతా నాన్ వెజ్ తినకుండా, ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకుండా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ఎక్కువగా లక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ తల్లి కటాక్షం కోసం కష్టపడుతూ ఉంటారు. వెల్లుల్లి, ఉల్లిపాయ కూరలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఉల్లిపాయ, వెల్లుల్లి ఉపయోగించకుండా పన్నీర్ గ్రేవీ..

Panner Gravy Curry: ఎందులోకైనా అదిరిపోయే పన్నీర్ గ్రేవీ కర్రీ..
Panner Gravy Curry
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 21, 2024 | 7:41 PM

కార్తీక మాసాలే కాదు చాలా మంది శ్రావణ మాసాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ నెల అంతా నాన్ వెజ్ తినకుండా, ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకుండా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ఎక్కువగా లక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ తల్లి కటాక్షం కోసం కష్టపడుతూ ఉంటారు. వెల్లుల్లి, ఉల్లిపాయ కూరలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఉల్లిపాయ, వెల్లుల్లి ఉపయోగించకుండా పన్నీర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

పన్నీర్, కారం, పసుపు, ఉప్పు, జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు, కసూరి మేతి, జీలకర్ర, పచ్చి మిర్చి, ఆయిల్ లేదా నెయ్యి.

పన్నీర్ గ్రేవీ కర్రీ తయారీ విధానం:

ముందుగా జీడిపప్పును శుభ్రంగా కడిగి వేడి నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పన్నీర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో పెరుగు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆయిల్ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును చిక్కని పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత గడ్డ పెరుగును తీసుకుని అందులో కారం, పసుపు, ఉప్పు, ధనియాల, జీలకర్ర పొడులు వేసి కలపాలి. పెరుగు పుల్లగా ఉంటే కొద్దిగా పంచదార వేయాలి. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమంలో జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి వేయాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ వేసి చిన్న మంట మీద ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులోనే పెరుగు, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఉడికాక.. ఉప్పు చూసుకుని నీళ్లు వేయాలి. గ్రేవీలా కావాలి కాబట్టి కాస్త నీటిని ఎక్కువే వేసుకోండి. చివరగా దించే ముందు కసూరి మేథీ, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కర్రీ సిద్ధం.