AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ ఇది మీకోసమే.. అబ్బాయిల మాదిరి మీసం, గడ్డం మీకూ వస్తుందా? ఐతే ఇలా నెల చేస్తే సరి..

చాలా మంది అమ్మాయిలకు పై పెదవి, గడ్డం మీద వెంట్రుకలు పెరిగే సమస్య ఉంటుంది. ఎందుకంటే వీరి శరీరంలో పురుష హార్మోన్ అయిన ఆండ్రోజెన్ అధిక స్థాయిలో ఉంటుంది. అందువల్లనే ఇలా జరుగుతుంది. అయితే ఈ హార్మోన్లను తగ్గించడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని నిపుణులు..

అమ్మాయిలూ ఇది మీకోసమే.. అబ్బాయిల మాదిరి మీసం, గడ్డం మీకూ వస్తుందా? ఐతే ఇలా నెల చేస్తే సరి..
Unwanted Facial Hair
Srilakshmi C
|

Updated on: May 01, 2025 | 8:54 PM

Share

అబ్బాయిలకు సహజంగానే మీసాలు, గడ్డం ఉంటాయి. వీరికి పుట్టుకతో వచ్చే లక్షణాలు ఇవి. కానీ కొందరు అమ్మాయిలకు కూడా ఇలా ముఖంపై అబ్బాయిల మాదిరి గడ్డం, మీసాలు వచ్చేస్తుంటాయి. దీంతో వారు నలుగురిలోకి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు. అందుకే వీళ్ళు కూడా ప్రతి రోజూ అబ్బాయి మాదిరి గడ్డం షేవ్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే, అందరు అమ్మాయిల మాదిరిగా ముఖాన్ని క్లీన్‌గా ఉంచుకోవడం సాధ్యం కాదు. వాళ్ళు ఎంత దాచడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. మరి ఈ సమస్యకు కారణం ఏమిటి? దీన్ని నివారించడానికి ఏమి చేయాలో? ఇక్కడ తెలుసుకుందాం..

చాలా మంది అమ్మాయిలకు పై పెదవి, గడ్డం మీద వెంట్రుకలు పెరిగే సమస్య ఉంటుంది. ఎందుకంటే వీరి శరీరంలో పురుష హార్మోన్ అయిన ఆండ్రోజెన్ అధిక స్థాయిలో ఉంటుంది. అందువల్లనే ఇలా జరుగుతుంది. అయితే ఈ హార్మోన్లను తగ్గించడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యను వదిలించుకోవడానికి మాత్రలు లేదా మందులను ఆశ్రయించే బదులు ఇంట్లోనే సింపుల్‌ చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు.

ముఖంపై వచ్చే వెంట్రుకలను శాశ్వతంగా తగ్గించడానికి.. ముందుగా ఒక చెంచా ధనియాలు తీసుకోవాలి. దానికి చిటికెడు దాల్చిన చెక్క పొడి లేదా లవంగాల పొడిని వేసి నీటిలో బాగా మరిగించాలి. అనంతరం ఈ నీటిని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగడం ప్రారంభించాలి. ఈ అలవాటును ఒక నెల పాటు రోజూ అనుసరించాలి. నెల తర్వాత తేడాను మీరే చూస్తారు. ఈ ఆరోగ్యకరమైన సహజ రెమెడీ ఒంట్లో ఆండ్రోజెన్ స్థాయిలు క్రమంగా తగ్గిపోయేలా చేస్తుంది. మీకు ఈ సమస్య ఉంటే మందులకు బదులు ఈ సులభమైన ఇంటి నివారణ చిట్కా ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్‌ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆ రైళ్లలో గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించలేరు.. కొత్త రూల్స్‌!
ఆ రైళ్లలో గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించలేరు.. కొత్త రూల్స్‌!
టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు