ముఖానికి రాసుకునే టాల్కమ్ పౌడర్‌తో ఎన్నో లాభాలు.. ఇలా ఎప్పుడైనా వాడారా?
చాలా మంది తమ శరీరాన్ని తాజాగా ఉంచుకోవడానికి, చెమట వాసన రాకుండా నివారించడానికి టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగిస్తుంటారు. కానీ దీని ఉపయోగం కేవలం శరీర పరిశుభ్రతమకు మాత్రమేకాదు. ఈ టాల్కమ్ పౌడర్‌ను ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లో టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగిస్తారు. చాలా మంది చెమటను తొలగించుకోవడానికి, తాజాగా అనిపించడానికి, శరీర దుర్వాసనను తగ్గించుకోవడానికి టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగిస్తారు. కానీ టాల్కమ్ పౌడర్ వాడకం కేవలం చర్మ సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు. దీని సహాయంతో రోజువారీ జీవితంలోని అనేక చిన్న చిన్న సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
జుట్టుకు డ్రై షాంపూగా వాడొచ్చు
వేసవిలో జుట్టు త్వరగా చెమటతో, జిడ్డుగా మారి అంటుకుపోయినట్లు కనిపిస్తుంది. ప్రతిరోజూ షాంపూ చేయడం సాధ్యం కాకపోతే, టాల్కమ్ పౌడర్ ఉపయోగపడుతుంది. తలపై కొద్దిగా పౌడర్ రాసి, బ్రష్‌తో సున్నితంగా దువ్వడం వల్ల అదనపు జిడ్డును పీల్చుకుని, జుట్టు మళ్లీ తాజాగా, మెరిసేలా కనిపించడం మొదలవుతుంది.
బట్టల నుంచి నూనె మరకలను తొలగించడానికి
బట్టలపై మొండి నూనె మరకలను తొలగించడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో, వెంటనే మరకలపై టాల్కమ్ పౌడర్‌ను రాయాలి. ఈ పౌడర్ నూనెను పీల్చుకుంటుంది. దీనివల్ల బట్టలు ఉతకడం సులభం అవ్వడమే కాకుండా మరక కూడా తగ్గుతుంది.
బూట్ల దుర్వాసన తొలగింపు
వేసవిలో చాలా మంది పాదాలకు ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల వారి బూట్లు దుర్వాసన వస్తాయి. బూట్లలో కొద్దిగా టాల్కమ్ పౌడర్ వేసి రాత్రంతా అలానే వదిలేయడం వల్ల తేమ, దుర్వాసన రెండూ తగ్గుతాయి.
బిగుతైన దుస్తులు ధరించినప్పుడు
స్కిన్నీ జీన్స్ లేదా బిగుతైన దుస్తులు ధరించడం వల్ల చర్మానికి రాపిడి ఏర్పడి, చర్మంపై ఎరుపు దద్దుర్లు వస్తాయి. అందువల్ల ఇటువంటి దుస్తులు ధరించే ముందు ఆ ప్రదేశంలో కొద్దిగా టాల్కమ్ పౌడర్ అప్లై చేయడం వల్ల, వాటిని ధరించినప్పుడు కలిగే చికాకు తగ్గుతుంది. అవి అంటుకుపోవు. చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
ఇసుక, సన్నని వెంట్రుకలను తొలగించడానికి
మీరు బీచ్ లేదా జలపాతం వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒంటికి ఇసుక అంటుకుంటుంది. టాల్కమ్ పౌడర్ రాసి బ్రష్‌తో రుద్దడం వల్ల ఇసుక సులభంగా తొలగిపోతుంది. ఇది కాకుండా హెయిర్‌కట్ తర్వాత మెడ లేదా ముఖానికి అంటుకున్న సన్నని వెంట్రుకలను తొలగించడానికి కూడా పౌడర్ రాస్తే ఇట్టే వదిలిపోతాయి. ఈ విధంగా టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగించడం వల్ల మీకు తాజాగా అనిపించడమే కాకుండా, రోజువారీ జీవితంలోని అనేక సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 దీనిని నిర్ధారించడం లేదు. ఇతర పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించండి.
