సాహసం అంటే ఇష్టం.. కొండకొనల మధ్య అందాలను గాలిలో తేలుతూ చూడాలని ఉందా.. జిప్‌లైనింగ్ కి బెస్ట్ ప్లేసెస్ ఇవే..

స్నేహితులతో సాహస యాత్రకు వెళ్లడంలో ఉన్న సరదా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే మీరు సోలో ట్రిప్‌లో కూడా జిప్‌లైనింగ్‌ను ఆస్వాదించవచ్చు. మీ కళ్ళ ముందు కదులుతున్నప్పుడు, చల్లని గాలి మిమ్మల్ని తాకినప్పుడు, అప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణింపలేనిది. జిప్ లైనింగ్ కు భారతదేశంలోని ఏ ప్రదేశాలు ఉత్తమంగా ఉంటాయో తెలుసుకుందాం.

సాహసం అంటే ఇష్టం.. కొండకొనల మధ్య అందాలను గాలిలో తేలుతూ చూడాలని ఉందా.. జిప్‌లైనింగ్ కి బెస్ట్ ప్లేసెస్ ఇవే..
Ziplining Adventure
Image Credit source: social media

Updated on: Jun 30, 2025 | 1:59 PM

జిప్‌లైనింగ్ అంటే ఒక వ్యక్తి ఒక ఎత్తైన ప్రదేశం నుంచి మరొక ఎత్తైన ప్రదేశానికి స్టీల్ తాడుపై వేలాడుతూ వేగంగా ప్రయాణించడం. ఇది ఒక రకమైన వినోద కార్యకలాపం లేదా అడ్వెంచర్ స్పోర్ట్స్ లేదా అత్యంత దైర్యసాహసలతో చేసే కార్యక్రమం. దీనిలో మీరు లోయల మధ్య పక్షిలా ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా అడవులు, నదులు, పర్వతాల మధ్య సాగే జిప్‌లైన్ కార్యకలాపాలు అద్భుతమైన సాహసయాత్రలా అనిపిస్తాయి. ఈ సమయంలో, ప్రకృతి అందమైన దృశ్యాలు కూడా మీ కళ్ళ ముందు కదులుతున్నప్పుడు, చల్లని గాలి మిమ్మల్ని తాకినప్పుడు, అప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణింపలేనిది. సాహసం చేయాలనుకునే వారికీ జిప్‌లైనింగ్ ఒక చిరస్మరణీయ కార్యకలాపంగా నిరూపించబడుతుంది. ఈ సోషల్ మీడియా యుగంలో జిప్‌లైనింగ్, బంగీ జంపింగ్ వంటి కార్యకలాపాలు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మీరు స్నేహితులతో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నా లేదా సోలో టూర్ చేయాలనుకున్నా ఈ రోజు ఏ ప్రదేశాలలో జిప్‌లైనింగ్ సాహసయాత్రను ఆస్వాదించవచ్చో తెలుకుందాం..

సముద్రం అయినా, నదులు అయినా, సరస్సులు అయినా, పర్వతాలు అయినా, ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. దీని కారణంగా అక్కడ పర్యాటకం ప్రోత్సహించబడుతుంది. పర్యాటకులను ఆకర్షించడానికి, ఈ ప్రదేశాలలో వివిధ రకాల కార్యకలాపాలు కూడా అభివృద్ధి చేయబడతాయి. వీటిలో జిప్‌లైనింగ్ కూడా ఉంది. భారతదేశంలోని ఏ ప్రదేశాలు దీనికి ప్రసిద్ధి చెందాయంటే…

ఇవి కూడా చదవండి

కేరళ మున్నార్
భారతదేశంలోని కేరళ దాని గొప్ప సంస్కృతి, ఆహారం, పచ్చని టీ తోటలు , అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. మున్నార్ ఇక్కడ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది పచ్చదనంతో నిండి ఉంది. ఇక్కడ జలపాతాలు, నదులు, అందమైన టీ తోటలను చూడగలిగే భారతదేశంలోనే అతి పొడవైన జిప్‌లైన్ ఉంది. ఈ దృశ్యాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.

ఢిల్లీ సమీపంలో నీమ్రానా
ఢిల్లీలో నివసిస్తున్నా.. లేదా డిల్లీకి వెళ్ళినా దగ్గరగా ఉన్న నగరం నీమ్రానా. ఇక్కడ ఒకటి కాదు 5 జిప్‌లైన్‌లు ఉన్నాయి. వీటి ఎత్తు దాదాపు 400 మీటర్లు. మీరు ఇక్కడ జిప్‌లైనింగ్ చేసినప్పుడు.. ఆరావళి కొండల మీదుగా వెళతారు. ఈ సమయంలో పక్షులు, అందమైన దృశ్యాలను అలాగే కోటలు వంటి అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు.

కికార్ లాడ్జ్ చండీగఢ్
పంజాబ్ కి సమీపంలోని కికార్ లాడ్జ్ చండీగఢ్‌లో జిప్‌లైన్‌ను ఆస్వాదించవచ్చు. ఇది దక్షిణాసియాలోనే అతి పొడవైన జిప్‌లైన్ అని చెబుతారు. ఇక్కడ పచ్చని అడవుల గుండా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. దీనితో పాటు ఇక్కడ అనేక ఇతర సాహస కార్యకలాపాలను చేయవచ్చు.

మధ్యప్రదేశ్‌లోని కేర్వా ఆనకట్ట
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలోని కెర్వా ఆనకట్ట కూడా జిప్‌లైన్ కార్యకలాపాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఎత్తైన కొండ నుంచి ప్రారంభమయ్యే జిప్‌లైన్ కెర్వా సరస్సు గుండా వెళుతుంది. ఈ సమయంలో మీరు అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూడవచ్చు. ఉత్కంఠభరితమైన అనుభవాన్ని కూడా పొందవచ్చు, ఎందుకంటే సరస్సునుంచి బలంగా ఎగసి పడే అలలు చుట్టూ కనిపిస్తాయి.

 

ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ
కొండ ప్రాంతాలలో సందర్శించదగిన పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే దేవ భూమి అని పిలువబడే ఉత్తరాఖండ్ సహజ సౌందర్యంతో నిండి ఉంది. ఇక్కడ ముస్సూరీ కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం, ఇక్కడ మీరు జిప్‌లైన్ కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు. ఇక్కడ 800 అడుగుల ఎత్తులో జిప్‌లైనింగ్ ఉంది. దీని అనుభవం కూడా చిరస్మరణీయంగా ఉంటుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..