2023లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన పర్యాటక ప్రదేశాలు ఇవే..

|

Dec 12, 2023 | 8:49 PM

వంట ఎలా చేయాలో మొదలు, విహారయాత్రకు ఏ ప్రదేశానికి వెళ్లాలి వరకు అన్నింటికీ గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే. ఏదైనా ప్రదేశానికి వెళ్లేప్పుడు ముందుగా గూగుల్‌లో సెర్చ్‌ చేసి వెళ్లడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో 2023 ఏడాది ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ ఏడాది ఎక్కువ మంది ఏ పర్యాటక ప్రదేశాల గురించి గుగుల్‌లో సెర్చ్‌ చేశారో ఇప్పుడు తెలసుకుందాం..

2023లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన పర్యాటక ప్రదేశాలు ఇవే..
Google Search 2023
Follow us on

ఏ చిన్న సమాచారం అవసరమైనా వెంటనే గుర్తొచ్చే పేరు.. గూగుల్‌. అవకాయ నుంచి అంతరిక్షం వరకు సకల సమాచారాన్ని క్షణాల్లో అరచేతిలో పొందొచ్చు. వంట ఎలా చేయాలో మొదలు, విహారయాత్రకు ఏ ప్రదేశానికి వెళ్లాలి వరకు అన్నింటికీ గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే. ఏదైనా ప్రదేశానికి వెళ్లేప్పుడు ముందుగా గూగుల్‌లో సెర్చ్‌ చేసి వెళ్లడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో 2023 ఏడాది ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ ఏడాది ఎక్కువ మంది ఏ పర్యాటక ప్రదేశాల గురించి గుగుల్‌లో సెర్చ్‌ చేశారో ఇప్పుడు తెలసుకుందాం..

* 2023లో ఎక్కువ గూగుల్‌లో సెర్చ్‌ చేసిన ప్రదేశాల్లో వియత్నాం మొదటి స్థానంలో ఉంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, రుచికరమైన ఆహారానికి వియత్నాం పెట్టింది పేరు. వియత్నాన్ని సందర్శించడానికి నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు మంచి సమయంగా చెప్పొచ్చు.

* ఇక 2023లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ డెస్టినేషన్స్‌లో భారత్‌లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. కేవలం భారతీయులను మాత్రమే కాకుండా విదేశీయులను సైతం ఆకర్షిస్తుందీ ప్రాంతం. నిర్మలమైన బీచ్‌లకు పెట్టింది పేరైన గోవాను యువతను అట్రాక్ట్ చేస్తుంటుంది. బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా వంటి ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

* ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన ప్రదేశాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కనిపించే అగ్ని పర్వాతాల అందాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రపంచ నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు ఎగబడుతుంటారు.

* ఇక శ్రీలంక 4వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచంలో అతిపెద్ద టీ ఉత్పత్తి చేసే దేశంగా పేరుగాంచిన శ్రీలంకలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి డచ్‌ స్టైల్‌లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్‌ మ్యూజియంలు, రెయిన్‌ ఫారెస్ట్‌లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

* బీచ్‌లకు, అందమైన ప్రకృతికి పెట్టింది పేరైన థాయిలాండ్‌ 5వ స్థానంలో నిలిచింది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

* భూతల స్వర్గంగా పిలుచుకునే కశ్మీర్‌ 6వ స్థానంలో నిలిచింది. ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన ప్రదేశాల్లో భారత్‌కు చెందిన కశ్మీర్‌ ఉంది. ఇక్కడు సర్సులు, అందమైన హౌస్‌బోట్‌లు, మంచు పర్యాటకులను రారమ్మంటూ ఆకర్షిస్తుంటాయి.

* ఇక ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన పర్యాటక ప్రదేశాల్లో కూర్గ్‌ 7వ స్థానంలో నిలవగా.. వరుసగా అండమాన్, నికోబార్ దీవులు.. ఇటలీ, స్విట్జర్లాండ్‌లు 8,9,10 స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..