Telangana Tourism: రూ. 1500ల్లో టూర్ ప్యాకేజీ.. ఒక్క రోజులోనే..

|

May 30, 2024 | 5:28 PM

సమ్మర్‌ హాలీడేస్‌ ముగిసేందుకు సమయం దగ్గరపడుతోన్న తరుణంలో ఎక్కడికైనా వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఉద్యోగరీత్యా లీవ్‌లు దొరకని పరిస్థితుల్లో కొందరు టూర్స్ ప్లాన్‌ చేయాలని ఉన్నా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం తక్కువ వ్యవధిలో వెళ్లొచ్చే టూర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను నుండి ఒక బడ్జెట్‌ ఫ్రెండ్లీ టూర్‌ ప్యాకేజీని...

Telangana Tourism: రూ. 1500ల్లో టూర్ ప్యాకేజీ.. ఒక్క రోజులోనే..
Telangana Tourism
Follow us on

సమ్మర్‌ హాలీడేస్‌ ముగిసేందుకు సమయం దగ్గరపడుతోన్న తరుణంలో ఎక్కడికైనా వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఉద్యోగరీత్యా లీవ్‌లు దొరకని పరిస్థితుల్లో కొందరు టూర్స్ ప్లాన్‌ చేయాలని ఉన్నా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం తక్కువ వ్యవధిలో వెళ్లొచ్చే టూర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను నుండి ఒక బడ్జెట్‌ ఫ్రెండ్లీ టూర్‌ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌, బీచ్‌పల్లి, అలంపూర్‌ పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పుకొవచ్చు. శనివారం, ఆదివార ఈ ప్యాకేజీ హైదరాబాద్‌ నుంచి అందుబాటులో ఉంటుంది. ఇంతకీ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* టూర్‌లో భాగంగా ఉదయం 8 గంటలకు సికింద్రబాద్‌లోని యాత్రి నివాస్‌ నుంచి బస్సు బయలుదేరుతుంది.

* ఉదయం 11.30 గంటలకు బీచ్‌పల్లి చేరుకుంటారు. ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయం కృష్ణానది పక్కన ఉంటుంది. కృష్ణానదిపై వంతెన దాటుతున్నప్పుడు ప్రకృతి అందాలు మరిచిపోలేని అనుభూతిని అందిస్తాయి.

* అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ఆలయాలను చూస్తారు.

* ఆ తర్వాత మధ్యాహ్నం హరిత హోటల్‌లో లంచ్‌ ఉంటుంది. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం స్నాక్స్‌ అందిస్తారు.

* ఇక సాయంత్రం 4.30 గంటలకు అలంపూర్ నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం మొదలువుతుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడం టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

ప్యాకేజీ ధర వివరాల విషయానికొస్తే.. ప్రతీ శనివారం, ఆదివారం ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా నాన్‌ ఏసీ బస్సు అందుబాటులో ఉంటుంది. టికెట్‌ ధరల విషయానికొస్తే పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 1200గా నిర్ణయించారు. ఒక్కరోజులోనే ప్యాకేజీ ముగియడం ఈ టూర్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..