Rajasthan Pride: రాజస్థాన్ తాజ్ మహల్ అందాలను చూసారా..? ఇక్కడికి ఎలా వెళ్లాలంటే..

|

Feb 22, 2024 | 6:45 PM

స్మారక చిహ్నం లోపలి భాగం అందమైన శిల్పాలు, కళలతో అలంకరించబడింది. స్మారక చిహ్నం చుట్టూ నిర్మించిన గదులు, స్తంభాల అందం అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. లోపల కొన్ని రాజులు చిత్రాలను కూడా చూడవచ్చు. దూరం నుండి కనిపించే గోపురాలు మొఘల్ వాస్తుశిల్ప సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి.

Rajasthan Pride: రాజస్థాన్ తాజ్ మహల్ అందాలను చూసారా..? ఇక్కడికి ఎలా వెళ్లాలంటే..
Taj Mahal Of Marwar
Follow us on

మీరు రాజస్థాన్‌లోని అనేక చారిత్రక ప్రదేశాలను చూసి ఉంటారు. లేదంటే వాటి గురించి విని ఉంటారు.. రాజస్థాన్ కొన్ని అద్భుతమైన ప్యాలెస్‌లకు ప్రసిద్ధి చెందింది. అంతేకాదు.. రాజస్థాన్ కొన్ని పురాతన కథలకు కూడా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్‌కు దాని అందం విషయంలో పోటీ లేదు. జోధ్‌పూర్ కూడా చాలా అందమైన నగరం. దీనిని బ్లూ సిటీ అని కూడా అంటారు. ఇక్కడ మరోక ప్రసిద్ధ స్మారక చిహ్నం తాజ్ మహల్ కూడా ఉందని మీకు తెలుసా..? దీనిని మేవార్ తాజ్ మహల్ అంటారు. సరస్సులు, చుట్టూ పచ్చదనంతో ఎంతో ఆకర్షణీయంగా ఉండే జోధ్‌పూర్‌ అంటే ప్రజలు, ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టం. అందుకే ఇక్కడికి పర్యాటకుల తాకిడీ ఎక్కువగా ఉంటుంది.

ఇకపోతే, ఇక్కడి చారిత్రక నిర్మాణం జస్వంత్ థాడాను మేవార్ తాజ్ మహల్ అని పిలుస్తారు. ఎందుకంటే దాని నిర్మాణంలో స్వచ్ఛమైన పాలరాయిని ఉపయోగించారు. అయితే దానిని ఆగ్రాలోని తాజ్ మహల్‌తో పోల్చినట్లయితే రాజస్థాన్ ప్యాలెస్ ఆగ్రాలోని తాజ్ మహల్‌కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జస్వంత్ థాడాలో మీరు చిన్న గోపురాలు కూడా చూడవచ్చు. దీనిని మహారాజా జశ్వంత్ సింగ్ స్మారకర్థాం ఆయన కుమారుడు మహారాజా సదర్ సింగ్ నిర్మించారు. దీని కోసం అప్పట్లో సుమారు రూ.2 లక్షల 84 వేలు ఖర్చుచేసినట్టుగా సమాచారం. స్మారక చిహ్నం లోపల మేవార్ కాలం నాటి రాజుల చిత్రాలు కనిపిస్తాయి. ఈ స్మారక చిహ్నంలో తెల్లని పాలరాయితో పాటు, ఎరుపు పాలరాయి కూడా కనిపిస్తుంది. ఇది ఈ స్మారక చిహ్నానికి భిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉంది.

ఈ చారిత్రక స్మారక చిహ్నం ఫలకాలపై స్థానిక జానపద సంగీత కళాకారులు మీకు స్వాగతం పలుకుతారు. కొంతమంది రాజస్థానీ కళాకారులు కూడా పర్యాటకులకు మంచి ఆతిథ్యం ఇస్తారు. స్మారక చిహ్నం లోపలి భాగం అందమైన శిల్పాలు, కళలతో అలంకరించబడింది. స్మారక చిహ్నం చుట్టూ నిర్మించిన గదులు, స్తంభాల అందం అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. లోపల కొన్ని రాజులు చిత్రాలను కూడా చూడవచ్చు. దూరం నుండి కనిపించే గోపురాలు మొఘల్ వాస్తుశిల్ప సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇకడి స్మారక చిహ్నం నిర్మాణం చాలా అద్భుతమైనది. పర్యాటకులు ఆకర్షణీయమైన శిల్పాలను చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ సరస్సు ఉంటుంది. స్మారక చిహ్నం ఆవరణలో ఎటు చూసిన పచ్చటి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ మీరు కాసేపు కూర్చుని ఈ అందమైన స్మారకాన్ని ఆరాధించవచ్చు. స్మారక చిహ్నం సమీపంలో శ్మశానవాటిక కూడా ఉంది. ఇక్కడ రాజ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు జరిగాయి. జోధ్‌పూర్ రాజస్థాన్‌లోని ఒక పెద్ద నగరం. మీరు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడికి సమీపంలో జోధ్‌పూర్ విమానాశ్రయం కూడా ఉంది. రైలు మార్గం కోసం మీరు జోధ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి ఇతర వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు రోడ్డుమార్గం ద్వారా కూడా ఇక్కడకు రావచ్చు, జోధ్పూర్‌కు దేశంలోని నలు మూలల నుంచి ఇక్కడకు వచ్చే ప్రయాణికుల కోసం మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..