Nallamala: అటవీ అందాలను దగ్గరగా వీక్షించాలనుకుంటున్నారా.. రేపటి నుంచి వైల్డ్ లైఫ్ టూరిజం పర్యటన మొదలు.. వివరాల్లోకి వెళ్తే..

|

Nov 14, 2021 | 5:09 PM

Nallamala Forest: ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్. నల్లమల్ల అందాలు వీక్షించేందుకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నారు అటవీ అధికారులు. అడవి అందాలతో పాటు..

Nallamala: అటవీ అందాలను దగ్గరగా వీక్షించాలనుకుంటున్నారా.. రేపటి నుంచి వైల్డ్ లైఫ్ టూరిజం పర్యటన మొదలు.. వివరాల్లోకి వెళ్తే..
Nallamala Forest Animals
Follow us on

Nallamala Forest: ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్. నల్లమల్ల అందాలు వీక్షించేందుకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నారు అటవీ అధికారులు. అడవి అందాలతో పాటు అడవి జంతువులను దగ్గరి నుంచి చూసేలా ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీని రూపొందించారు. సోమవారం నుంచి ప్రారంభంచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రకృతి ప్రేమికులకు నల్లమల అందాలతో అద్భతమైన అనుభూతిని ఇచ్చేందుకు అటవీ శాఖ సఫారీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అమ్రాబాద్ పులల అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ టూరిజం చేపట్టింది. ఈ నెల 15(రేపటి నుంచి) పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారికి మొదటి రోజన మన్ననూరు నుంచి అడవి గుండా 4 కిలోమీటర్ల దూరంలో ఉమామహేశ్వరం వరకు ట్రెక్కింగ్ కు తీసుకెళ్తారు. సాయంత్రం ప్రత్యేక వాహనం మన్ననూరు కు తీసుకొచ్చి అడవిలోని కాటేజీల్లో రాత్రి భోజనం, బస ఏర్పాటు చేస్తారు. ఉదయం సఫారీలో భాగంగా ఫర్హాబాద్ తీసుకెళ్తారు. తిరుగ ప్రయాణంలో దట్టమైన అడవి గుండా మన్ననూరుకు చేరుకుంటారు. భోజనం అనంతరం బయోల్యాబ్ సందర్శన ఉంటుంది. అడవి జంతువులు, పెద్దపులులు, అడవులు వాటి ఆవశ్యకతపై లఘు చిత్రాలను చూపిస్తారు. నల్లమలలోని అరుదైన కీటకాలను ప్రదర్శిస్తారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో వివిధ రకాల జంతువుల గురించి వివరిస్తారు. వన్యప్రాణులు, అడవుల రక్షణ గురించి అవగాహన కల్పిస్తాడు. ఆదివాసి, గిహిజనులే పర్యాటకులకు ట్రెక్కింగ్, సఫారీ పర్యటనలో గైడ్ గా వ్యవహరిస్తారు. అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యంపై పర్యాటకులకు అవగాహన పెంచడానికి స్థానిక ఆదివాసులకు ఉపాధి కల్పించేందుకు ఈ సఫారీ కార్యక్రమాన్ని చేపట్టామని నాగర్ కర్నూల్ అటవీ శాఖ జిల్లా అధికారి కృష్ణాగౌడ్ చెబుతున్నారు.

సఫారీ యాత్ర చేసే వారు ఇద్దరైతే ఏసి గదిలో రెండు పడకలతో బస చేసేందుకు నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నలుగురైతే ఏడు వేల రూపాయలు, ఆరుగురైతే తొమ్మిది వేల రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. భోజనాలను ఆర్డర్ పై సమకూరస్తారు. గైడ్ కు రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి నల్లమల అడవిని మంచి టూరిజం స్పాట్ గా మార్చేందుకు నడుం బిగించారు అటవీ శాఖాధికారులు.

 

Also Read:   సీజనల్ ఫ్రూట్ అనాస తినడం వలన కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజలు ఎన్నో..