IRCTC: కొత్తేడాది విదేశాలకు టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? సింగపూర్‌కు బడ్జెట్‌ ధరలో ట్రిప్‌ వేసే అవకాశం.

|

Dec 17, 2022 | 6:20 AM

దేశంలో విహార యాత్రలతో బోర్‌గా ఫీలవుతున్నారా.? కొత్తేడాది విదేశాల్లో జాలీగా హాలీడే ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా.? మీలాంటి వారి కోసమే ఇండియన్‌ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. సింగపూర్‌ను తక్కువ ఖర్చుతో సందర్శించే విధంగా..

IRCTC: కొత్తేడాది విదేశాలకు టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? సింగపూర్‌కు బడ్జెట్‌ ధరలో ట్రిప్‌ వేసే అవకాశం.
Irctc
Follow us on

దేశంలో విహార యాత్రలతో బోర్‌గా ఫీలవుతున్నారా.? కొత్తేడాది విదేశాల్లో జాలీగా హాలీడే ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా.? మీలాంటి వారి కోసమే ఇండియన్‌ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. సింగపూర్‌ను తక్కువ ఖర్చుతో సందర్శించే విధంగా ఓ ప్రత్యేక టూర్‌ను ప్లాన్‌ చేసింది. ఇంతకీ ఈ టూర్‌ ఎక్కడి నుంచి మొదలవుతుంది.? ఎంత ఖర్చు అవుతుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఈ టూర్‌ ప్యాకేజీలో కేవలం 32 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ టూర్ రెండు విడతలుగా ఉంటుంది. మొదటి పర్యటన 2023 జనవరి 18న ప్రారంభం అవుతుంది. రెండో పర్యటన జనవరి 24న ఉంటుంది. ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లో సింగూర్ విమానం ఎక్కాల్సి ఉంటుంది. టూరిస్టులు ఢిల్లీ నుంచి బయలు దేరి సింగపూర్‌లోని మలిండో ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ప్యాకేజీలో భాగంగా సింగపూర్‌లోని పుత్రజయ టూర్, కింగ్స్ ప్యాలెస్, జామెక్స్ మసీదు, చాక్లెట్ ఫ్యాక్టరీ, పెట్రోనాస్ ట్విన్ టవర్, కె.ఎల్ టవర్ , పార్లమెంట్ హౌస్, సుప్రీం కోర్ట్, సిటీ హాల్‌తో పాటు మరికొన్ని ప్రముఖ ప్రాంతాలను చూపిస్తారు.

ఇక ప్యాకేజీ ధర విషయానికొస్తే సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,35,000 చెల్లించాల్సి, డబుల్/ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,15,500 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులు విత్‌ బెడ్‌ ఉంటే రూ. 1,03,000, వితౌట్‌ బెడ్‌ అయితే రూ. 92,200 చెల్లించాలి. టూర్‌ మొత్తం 6 రోజులు సాగుతుంది. ఫీజులోనే వీసా ఫీజు, విమాన ఛార్జీలు, లొకేషన్‌లో రోడ్డు ప్రయాణ అవసరాలు, 3-స్టార్ హోటల్‌లో రాత్రి వసతి, బ్రేక్‌పాస్ట్, లంచ్, డిన్నర్, ఆయా టూరిస్ట్‌ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ ఛార్జీలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇంగ్లిష్ స్పీకింగ్ టూర్ గైడ్, టాక్స్‌లు కలిపి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..