IRCTC Tour: సమ్మర్ టూర్ ప్లాన్‌ చేస్తున్నారా.? హైదరాబాద్‌ టూ అండమాన్‌.. ధర కూడా తక్కువే.

సమ్మర్‌ వచ్చేసింది. ఇప్పుడిప్పుడే విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటిస్తున్నారు. ఇంకేముంది అలా ఏదైనా టూర్‌ వేయాలని ప్లాన్‌ చేస్తుంటారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా.? మరి ఈ మండుటెండల్లో చల్లగా బీచ్‌లలో సందడి చేస్తూ ఎంజాయ్‌ చేస్తే భలే ఉంటుంది కదూ! ఇలాంటి వారి కోసమే...

IRCTC Tour: సమ్మర్ టూర్ ప్లాన్‌ చేస్తున్నారా.? హైదరాబాద్‌ టూ అండమాన్‌.. ధర కూడా తక్కువే.
Tour

Updated on: Apr 18, 2023 | 7:26 PM

సమ్మర్‌ వచ్చేసింది. ఇప్పుడిప్పుడే విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటిస్తున్నారు. ఇంకేముంది అలా ఏదైనా టూర్‌ వేయాలని ప్లాన్‌ చేస్తుంటారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా.? మరి ఈ మండుటెండల్లో చల్లగా బీచ్‌లలో సందడి చేస్తూ ఎంజాయ్‌ చేస్తే భలే ఉంటుంది కదూ! ఇలాంటి వారి కోసమే ఐఆర్‌టీసీ ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి అండమాన్‌కు ప్రత్యేక టూర్‌ ఆప్షన్‌ను అందిస్తోంది. అమేజింగ్‌ అండమాన్‌ ఎక్స్‌ హైదరాబాద్‌ పేరుతో ఈ ప్కాకేజీ ప్రకటించింది. ఈ టూర్‌ 5 రాత్రులు, ఆరు రోజులు సాగుతుంది. మే 26వ తేదీన ఈ టూర్‌ ఉండనుంది. ఇంతకీ ఈ టూర్‌లో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంత ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* మొదటి రోజు.. హైదరాబాద్ విమానాశ్రయం ఉదయం 04.35 గంటలకు బయల్దేరుతారు. 09.15 గంటల వరకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో ఫ్రెషప్‌ అయిన తర్వాత సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని చూపిస్తారు. ఆ తర్వాత లైట్, సౌండ్ షో ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది.

* రెండో రోజు హావ్‌లాక్‌కు తీసుకెళ్తారు. అనంతరం అక్కడ హోటల్‌లో దిగిన తర్వాత.. రాధానగర్ బీచ్‌ను చూపిస్తారు. రాత్రి హావ్‌లాక్ లోనే బస ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* ఇక మూడో రోజు.. ఉదయం హోటల్‌లో టిఫిన్‌ తర్వాత కాలాపత్తర్ బీచ్ సందర్శిస్తారు. అక్కడ ప్రీమియం క్రూయిజ్‌ జర్నీ ఉంటుంది. అనంతరం లంచ్‌ చేసిన తర్వాత నేచురల్‌ బ్రిడ్జ్‌, లక్ష్మణపూర్ బీచ్ విజిట్ ఉంటుంది.

* నాల్గవ రోజు ఉదయం.. భరత్‌పూర్ బీచ్‌లో సూర్యోదయాన్ని చూపిస్తారు. ఆ తర్వాత క్రూయిజ్‌లో పోర్ట్ బ్లెయిర్‌కు తీసుకెళ్తారు.

* 5వ రోజు ఉదయం హోటల్‌లో టిఫిన్‌ చేసిన తర్వాత రాస్ ఐలాండ్ బయలుదేరుతారు. అనంతరం నార్త్ బే సందర్శన ఉంటుంది. అనంతరం నేవల్ మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు.

* ఇక చివరి రోజైన 6వ రోజు టిఫిన్‌ చేసిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. ఉదయం 7.55 గంటలకు విమానం ఎక్కి మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్‌ ముగుస్తుంది.

టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే..

సింగిల్‌ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.55,780, డబూల్ ఆక్యుపెన్సీకి రూ.43,170, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.42,885గా ఉంటుంది. ఫుడ్‌, హోటల్‌ ఛార్జెస్‌ అన్ని ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..