కాచిగూడ నుంచి జ్యోతిర్లింగ యాత్ర.. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్.. బెస్ట్ IRCTC ప్యాకేజీ
IRCTC Jyotirlinga Yatra Package: మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్” పేరుతో IRCTC ఈ వేసవికి ప్రత్యేక యాత్రను అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల ఈ ప్యాకేజీలో భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్ దర్శనం ఉంటుంది. టికెట్, ప్యాకేజీ వివరాలు అందుబాటులో ఉన్నాయి. రైలు హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
ఈ వేసవికి IRCTC తీసుకొచ్చిన ప్రత్యేక యాత్రలో మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ తీర్థస్థలాలు, చారిత్రక ప్రదేశాలను దర్శించే అవకాశం ఉంటుంది. భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్ వంటి పవిత్ర నగరాలను కవర్ చేస్తూ ఈ టూర్ రూపొందించారు.
ప్యాకేజీ వివరాలు
ప్యాకేజీ పేరు: మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్
ప్రయాణ వ్యవధి: 5 రాత్రులు – 6 పగళ్లు
ప్రయాణ రైలు: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (12707)
బయలుదేరు స్టేషన్: కాచిగూడ / సికింద్రాబాద్
ప్రయాణ రోజులు: ప్రతి బుధవారం
వసతి ఎంపికలు: స్లీపర్, 3AC
ప్రయాణ షెడ్యూల్ (ఇటినరరీ)
1వ రోజు
సాయంత్రం 4:30కు కాచిగూడ/సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.
2వ రోజు – భోపాల్
ఉదయం భోపాల్ చేరుకోడం
హోటల్ చెక్-ఇన్, ఫ్రెష్ అప్
మధ్యాహ్నం:
సాంచీ స్తూపం (40 కి.మీ)
భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం
సాయంత్రం: ట్రైబల్ మ్యూజియం సందర్శన
రాత్రి భోపాల్‌లో బస
3వ రోజు – ఉజ్జయిని
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్-ఔట్
భోపాల్ నుంచి ఉజ్జయిని (సుమారు 200 కి.మీ) ప్రయాణం
ఉజ్జయినిలో సందర్శనలు:
మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం
హర్ సిద్ధి ఆలయం
మంగళనాథ్ టెంపుల్
నవగ్రహ శని మందిరం
శ్రీ చింతామణ్ గణేశ్ ఆలయం
రామ్ ఘాట్, శ్రీ కాళికా ఆలయం
రాత్రి ఉజ్జయినిలో బస
4వ రోజు – మహేశ్వర్ & ఓంకారేశ్వర్
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బయలుదేరితే..
మహేశ్వర్ సందర్శన:
అహల్యబాయి కోట
నర్మదా ఘాట్
అనంతరం ఓంకారేశ్వర్ దర్శనం (జ్యోతిర్లింగం)
సాయంత్రం బోటింగ్ అనుభవం
రాత్రి ఓంకారేశ్వర్‌లో బస
5వ రోజు – ఇండోర్
హోటల్ చెక్‌ఔట్
ఇండోర్ చేరుకోవడం (70 కి.మీ)
సందర్శనలు:
లాల్‌బాగ్ ప్యాలెస్
ఖజ్రానా గణేశ్ ఆలయం
సాయంత్రం రైల్వే స్టేషన్‌కు బయలుదేరు
రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభం (రైలు 19301)
6వ రోజు
రాత్రంతా ప్రయాణం తర్వాత తిరిగి గమ్యస్థానానికి చేరుకోడం