IRCTC Tour Package: నేపాల్‌ని చుట్టేసి వద్దామనుకుంటున్నారా.. అత్యంత తక్కువ ఖర్చుతో IRCTC సరికొత్త ప్యాకేజీ.. వివరాలు ఇవే..
Nepal Tour Package: ఖాట్మండుతో పాటు మీరు ఈ ప్యాకేజీలో భక్తపూర్, పటాన్‌లను కూడా సందర్శించవచ్చు. మీరు ఈ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. ఈ ప్యాకేజీకి సంబంధించిన అన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇండియన్ రైల్వేస్‌తో కలిసి పర్యాటకుల కోసం ఎల్లప్పుడూ కొత్త టూర్ ప్యాకేజీలను అందిస్తుంది. మీరు తక్కువ డబ్బుతో విదేశాలకు వెళ్లాలనుకుంటే.. మీరు ఈ IRCTC టూర్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా మీరు నేపాల్‌లోని అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో మీరు అక్టోబర్ నెలలో ఖాట్మండు వంటి ప్రాంతాలకు వెళ్లవచ్చు. ఈ ప్యాకేజీకి వండర్స్ ఆఫ్ నేపాల్ ఎక్స్ అగర్తలని పేరు పెట్టారు. ఈ ప్యాకేజీలో ఖాట్మండుతో పాటు మీరు భక్తపూర్, పటాన్‌లను కూడా సందర్శించవచ్చు. మీరు ఈ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. ఈ ప్యాకేజీకి సంబంధించిన అన్ని వివరాలను మేము మీకు తెలియజేస్తాం. దీనితో పాటు, ఈ ప్యాకేజీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఛార్జీల (IRCTC నేపాల్ టూర్ ప్యాకేజీ) గురించి కూడా మేము మీకు సమాచారాన్ని అందిస్తున్నాం.
భారతీయ రైల్వేల సహకారంతో IRCTC ఈ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించినట్లు IRCTC ట్వీట్ చేసింది. ఈ ప్యాకేజీ గురించి సమాచారం ఇస్తూ, IRCTC తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేయడం ద్వారా సమాచారాన్ని షేర్ చేసింది. ఇందులో, మీరు నేపాల్‌లోని అందమైన భవనాలను చూడాలనుకుంటే.. అక్కడి అందమైన దేవాలయాలను సందర్శించాలనుకుంటే.. IRCTC టూర్ ప్యాకేజీ ద్వారా ప్రయాణించండని IRCTC తెలిపింది. ఈ పూర్తి ప్యాకేజీ అగర్తల నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ 6 పగళ్లు, 7 రాత్రులుగా నిర్ణయించారు.
Experience the Nepal’s architecture, exquisite monuments, sculptures, temples and magnificent art with IRCTC tour package of 7D/6N starts at ₹42,305/- pp*. For details, visit https://t.co/dLToLJAUV2 @AmritMahotsav #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) July 26, 2022
ప్యాకేజీ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ప్యాకేజీ పేరు – Wonders of Nepal, Puja Special గమ్యం – ఖాట్మండు, భక్తపూర్, పటాన్ ప్రయాణ విధానం – రైలు/విమాన ప్రయాణ వ్యవధి – 6 రోజులు, 7 రాత్రులు భోజన ప్రణాళిక – అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం
ఈ సౌకర్యాలు ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి-
1. మీరు అగర్తల నుంచి రైలులో న్యూ జల్పాయిగురికి వెళ్లి అక్కడి నుంచి విమానంలో కంఠమడుకు వెళతారు. 2. ప్రయాణం అంతా డీలక్స్ రైలులో ప్రయాణించే అవకాశం మీకు లభిస్తుంది. 3. మీరు ప్రయాణం అంతటా భోజన సౌకర్యం పొందుతారు. 4. మీరు హిందీ, ఇంగ్లీష్ మాట్లాడే టూరిస్ట్ గైడ్ పొందుతారు. 5. ప్రతిచోటా మీరు రాత్రిపూట బస చేయడానికి హోటల్ సౌకర్యం పొందుతారు.
ఎంత ఫీజు చెల్లించాలి?
- ఈ ప్యాకేజీలో ఒంటరిగా ప్రయాణించాలంటే రూ.51,015 చెల్లించాల్సి ఉంటుంది.
- అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు రూ.44,060 చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురు వ్యక్తులు రూ.42,30 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- పిల్లలకు ప్రత్యేక ఫీజు ఉంటుంది.
- ఈ ప్యాకేజీలో మరింత సమాచారం పొందడానికి, మీరు IRCTC వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా సమాచారాన్ని పొందాలి.
మరిన్ని టూరిజం న్యూస్ కోసం..