మనం ఉండే ఇళ్లు అద్దె.. మనకు వచ్చే ఆదాయం లేదా.. జీతాల కన్న తక్కువ ఉండేలా చూసుకుంటాం. ఇంకాస్త డబ్బులు ఉన్నవాలైతే.. లక్షో రెండు లక్షలో ఉంటుంది. కానీ.. ఓ ఇంటి అద్దె వింటే మాత్రం.. మీకు కళ్లుతిరిపోవడం ఖాయం..! నమ్మలేకపోతున్నారా..? అయితే ఈ స్టోరీ చూసేయండి మీకే అర్థమవుతుంది.
హాంగ్‌కాంగ్‌లోని ఓ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి అద్దె అక్షరాలా.. 1.26కోట్లు.. అవును మీరు విన్నది నిజమే.. మరి ఇంత భారీ స్థాయిలో రెంట్ ఉండే ఆ ఇంటి ప్రత్యేకతలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.. కానీ శ్రీమంతులు మాత్రమే అద్దెకు తీసుకునేలా ఉన్న లగ్జరీ హౌస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ ఇల్లు మొత్తం 10,804 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఇంట్లో.. ఓ ప్రైవేట్ గ్యారేజ్, లిఫ్టు కూడా ఉన్నాయి. అంతేకాదు రకరకాల మొక్కలుంటే ఓ అందమైన తోట కూడా ఉంది. హాంగ్‌కాంగ్ లెక్కల్లో దీని నెలరోజుల అద్దె 1.35 మిలియన్ హాంగ్‌కాంగ్ డాలర్లు. ఈ భవనంలో నుంచి ఇక్కడి విక్టోరియా హార్బర్ స్పష్టంగా కనిపిస్తుందట.
మరిన్ని ఇక్కడ చదవండి :
Crime: యూపీలో మరో ఘోరం.. కుమార్తె తల నరికి.. చేతిలో పట్టుకొని.. గ్రామంలో తిరిగిన తండ్రి..
గ్రాండ్ గా గుర్రం బర్త్ డే వేడుకలు.. పండగ జరిపిన యజమాని.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోలు..