ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాల సందర్శనార్ధం స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో ఆధ్యాత్మిక తీర్థయాత్ర ను అందిస్తోంది. వారణాశి నుంచి అయోధ్య , ప్రయాగ్ రాజ్ సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. 4 రాత్రులు, 5 రోజుల పాటు సాగనున్న ఈ ప్యాకేజీ వివరాలను IRCTC X పోస్ట్ ద్వారా ప్రకటించింది. హోలీ కాశీ విత్ అయోధ్య దర్శన్ ఎక్స్ కోజికోడ్ (SEA37) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ గురించి వినియోగదారులకు తెలియజేసింది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 9వ తేదీన ప్రారంభం కానుంది. నివేదిక ప్రకారం ప్రయాణీకులు ఎంచుకున్న ఆక్యుపెన్సీపై టూర్ ప్యాకేజీకి సంబంధించిన టారిఫ్ భిన్నంగా ఉంటుంది. అల్పాహారం, విందు సహా IRCTC ఇస్తున్న టూర్ ప్యాకేజీ ద్వారా అందించనుంది. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు కోసం అధికారిక పేజీకి వెళ్ళవచ్చు.
From the ancient #Varanasi to the sacred #Ayodhya and soul-strirring #Prayagraj, allow #IRCTCTourism to lead you on a #spiritual pilgrimage.
Destinations Covered – Varanasi, Prayagraj and Ayodhya
Package Price – ₹34,720/- onwards per person* ఇవి కూడా చదవండిBegin a soulful journey.
Book now… pic.twitter.com/9ReUh37ljx
— IRCTC (@IRCTCofficial) July 23, 2024
ఈ ప్యాకేజీకి సంబంధించిన టిక్కెట్‌లను IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.comలో బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు , ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం 8287932064, 8287932117, 8287932082, 8287932098, 8287932095 నంబర్లలో సంప్రదించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..