Andaman Tour: హైదరాబాద్ టు అండమాన్ దీవులు.. అతి తక్కువ బడ్జెట్లో.. ఐఆర్సీటీసీ సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్

పర్యటనలు ఇష్టపడేవారు లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాలనుకునే ప్రదేశం అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ దీవుల పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేవి దట్టమైన అడవులు. అయితే, అవి మాత్రమే కాదు. ఈ ప్రదేశం అందమైన దీవులకు నిలయం. మూడు వైపులా సముద్రం మధ్యలో దీవులు. వీటి గురించి వినడమే కానీ చాలా మంది ఇటువైపు వెళ్లే ప్లాన్ చేసి ఉండరు. అలాంటి వారి కోసమే ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీతో మీ ముందుకొచ్చింది. హైదరాబద్ లో ఫ్లైట్ ఎక్కితే నేరుగా అందమైన దీవుల్లో కాలుమోపేలా ప్లాన్ చేసింది. అక్కడి ఇసుక తిన్నెల్లో, సముద్ర తీరం మధ్యలో ఈ దీవులను చూస్తూ గడపడం చెప్పలేని అనుభూతిని పంచుతుంది.

Andaman Tour: హైదరాబాద్ టు అండమాన్ దీవులు.. అతి తక్కువ బడ్జెట్లో.. ఐఆర్సీటీసీ సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్
Hyderabad To Andaman Tour

Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 01, 2025 | 7:17 AM

వేసవి టూర్ ను ఎంజాయ్ చేయాలనుకునే వారికోసం ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజీతో ముందుకు వచ్చింది. అమేజింగ్ అండమాన్ పేరుతో హైదరాబాద్ నుంచి టూర్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉండనుంది. టూర్ లో భాగంగా పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ఐలాండ్, నెయిల్​ ఐలాండ్ తో పాటు అక్కడి ఫేమస్ పరిసరాలను కూడా చూసిరావచ్చు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ కి వెళ్లి రావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి టూర్ ఎప్పుడు మొదలవుతుంది, ప్యాకేజీ వివరాలు, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి అనే వివరాలు తెలుసుకుందాం.

ప్యాకేజీ వివరాలు..

హైదరాబాద్‌ నుంచి ఉదయం 06.35 గంటలకు హైదరాబాద్ విమానశ్రయం నుంచి టూర్ ప్రారంభం అవుతుంది.కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ. 68,320, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ. 51,600, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.49,960 చెల్లించాలి.
5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.42,950 చెల్లించాలి.
2 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ. 39,525 పే చేయాలి.

ప్యాకేజీ ధర వివరాలు :

సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 68,320, డబుల్ ఆక్యుపెన్సీకి వ్యక్తికి రూ. 51,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.49,960 చెల్లించాల్సి ఉంటుంది.

5-11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ రూ.42,950.

2-11 సంవత్సరాల చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​ రూ. 39,525.

ప్యాకేజీలో లభించే సదుపాయాలు:

1. హైదరాబాద్ నుండి పోర్ట్ బ్లెయిర్‌కు విమాన ప్రయాణ ఛార్జీలు

2.3 -స్టార్ హోటల్‌లో 5 రాత్రులు బస (పోర్ట్ బ్లెయిర్‌లో 2 రాత్రులు, హేవ్‌లాక్ ఐలాండ్‌లో 2 రాత్రులు, నీల్ ఐలాండ్‌లో 1 రాత్రి)

3. హోటల్‌లో అల్పాహారం, రాత్రి భోజనం వారే అందిస్తారు.

4. ఏసీ వాహనంలో అన్ని సందర్శనా స్థలాలు ప్రయాణ ఖర్చులతో సహా తిప్పి చూపుతారు.

5. అన్ని సందర్శనా స్థలాలకు ప్రవేశ రుసుములు, గైడ్ ఛార్జీలు వారివే ఉంటాయి.

6. పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపం, నీల్ ద్వీపానికి ఫెర్రీ బదిలీలు.

ప్యాకేజీలో లేని సౌకర్యాలు..

భోజనం, స్నాక్స్, వాటర్ గేమ్స్, ఇతర వ్యక్తిగత ఖర్చులు లాండ్రీ, టిప్స్ ప్యాకేజీ ద్వారా లభించవు.

ఈ ప్యాకేజీ మార్చి 12వ తేదీన అందుబాటులో ఉంది.