గోవాలోని నిశ్శబ్ద బీచ్‌లని ఎప్పుడైనా సందర్శించారా..! ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళుతారు..

| Edited By: Anil kumar poka

Nov 15, 2021 | 1:09 PM

Goa Beaches: గోవా నిర్మలమైన, అద్భుతమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇది సెలవులకు మంచి విడిది. కానీ ఏకాంత అనుభూతిని పొందాలంటే మాత్రం కచ్చితంగా దక్షిణ

గోవాలోని నిశ్శబ్ద బీచ్‌లని ఎప్పుడైనా సందర్శించారా..! ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళుతారు..
Goa Beaches
Follow us on

Goa Beaches: గోవా నిర్మలమైన, అద్భుతమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇది సెలవులకు మంచి విడిది. కానీ ఏకాంత అనుభూతిని పొందాలంటే మాత్రం కచ్చితంగా దక్షిణ గోవాకు వెళ్లాల్సిందే. ఇక్కడ జన సంచారం తక్కువగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రశాంతతను అనుభవించడానికి ఈ బీచ్‌లను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

1. ఉటోర్డా బీచ్
ఉటోర్డా బీచ్ దక్షిణ గోవాలోని ఒక అందమైన బీచ్. ఇది ఒక చిన్న బీచ్. ఇది మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇది ప్రశాంతమైన, శుభ్రమైన బీచ్. ఇక్కడ చాలా తక్కువ రద్దీ ఉంటుంది. ఇక్కడ మీరు కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు.

2. బటర్‌ఫ్లై బీచ్
బటర్‌ఫ్లై బీచ్ ఒక ప్రత్యేకమైన ఎంపిక. ప్రపంచానికి దూరంగా ఏకాంతాన్ని అందిస్తుంది. ఇది దక్షిణ గోవాలోని పలోలెం బీచ్‌కు ఉత్తరాన ఉన్న అద్భుతమైన బీచ్. ఇక్కడికి చేరుకోవాలంటే ఫెర్రీ బోట్‌లో వెళ్లాలి.

3. పలోలెం బీచ్
పలోలెం దక్షిణ గోవాలోని ఒక అందమైన బీచ్. సరదా-ప్రేమికులు, పార్టీలు చేసుకోవడానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సందర్శకులు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఆనందించవచ్చు. నృత్యం చేయవచ్చు. ఈ ప్రదేశంలోని తెల్లని ఇసుక చూడముచ్చటగా ఉంటుంది.

4. మోబోర్ బీచ్
మోబోర్ బీచ్ సందర్శన మీకు చాలా సంతోషాన్నిస్తుంది. ఇది గొప్ప వాటర్ స్పోర్ట్స్, అద్భుతమైన వైబ్‌లకు ప్రసిద్ధి చెందింది. మీరు ఇక్కడ కూర్చుని బర్డ్ స్పాటింగ్, నీటి అడుగున చేపలు పట్టడం మొదలైనవి చేయవచ్చు.

5. కోలా బీచ్
కోలా బీచ్‌ను సీక్రెట్ బీచ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది రెండు కొండల మధ్య ఉంటుంది. ఇది అందమైన బంగారు ఇసుక బీచ్. ఈ ప్రదేశం గురించి చాలా తక్కువ మంది పర్యాటకులకు మాత్రమే తెలుసు కాబట్టి ఈ ప్రదేశంలో ఎక్కువ రద్దీ ఉండదు మీరు ఇక్కడ పూర్తి శాంతిని అనుభవిస్తారు.

Skin Care: మెడపైన ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..! ఈ ఐదు మార్గాలను తెలుసుకోండి..

Backache: వెన్నునొప్పితో బాధపడుతున్నారా..! ఒక్కసారి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..

Cold: జలుబు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా..! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి..