వారెవ్వా.. గోరింటాకుతో బోలెడన్నీ ప్రయోజనాలు.. ఎర్రగా పండాలంటే ఇలా చేయండి

గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయంలో భాగం.. పండగైనా.. పంక్షన్ అయినా.. ఇంకేదైనా స్పెషల్ ప్రోగ్రామ్ అయినా.. అమ్మాయిలు, మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు పెట్టుకుంటారు. వాస్తవానికి ఎవ్వరైనా గోరింటాకును పెట్టుకోవచ్చు.. అయితే.. గోరింటాకు ప్రయోజనాలు.. ఎర్రగా పండాలంటే ఏం చేయాలి..? అనే వివరాలను తెలుసుకోండి..

వారెవ్వా.. గోరింటాకుతో బోలెడన్నీ ప్రయోజనాలు.. ఎర్రగా పండాలంటే ఇలా చేయండి
Mehandi Tips

Updated on: Feb 26, 2026 | 3:48 PM

గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయంలో భాగం.. పండగైనా.. పంక్షన్ అయినా.. ఇంకేదైనా స్పెషల్ ప్రోగ్రామ్ అయినా.. అమ్మాయిలు, మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు పెట్టుకుంటారు.. మంచి మంచి డిజైన్లతో.. చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. వాస్తవానికి పూర్వీకుల కాలం నాటి నుండి వస్తున్న సంప్రదాయం ప్రకారం.. ఆషాడమాసంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా.. సాధారణ రోజుల్లో కూడా గోరింటాకును పెట్టుకుంటారు. అయితే.. గోరింటాకు ఎర్రగా, అందంగా పండాలంటే.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని.. కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్.. ఈ హోం రెమిడీస్ ద్వారా.. గోరింటాకు ఎర్రగా అద్భుతంగా పండుతుందని.. చేతులు ఎర్రగా మారి మెరుస్తాయని పేర్కొంటున్నారు.

గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇలా చేయండి..

ముందుగా గోరింటాకు కొమ్మల నుండి ఆకులను జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలి. కాడలు లేకుండా చూసుకోవడం ముఖ్యం. పచ్చి ఆకులు అందుబాటులో లేకపోతే, మెహందీ పౌడర్ ని కూడా ఉపయోగించవచ్చు. గోరింటాకు ఎక్కువగా ఉన్నప్పుడు, నీడలో ఎండబెట్టి పొడిగా చేసుకుని నిల్వ చేసుకుంటే చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.

గోరింటాకు పేస్ట్ తయారు చేయడానికి, ఒక బౌల్లో తాంబూలంలో వాడే వక్కను చిన్న చిన్న ముక్కలుగా దంచుకుని వేసుకోవాలి. అదే బౌల్లో కొద్దిగా చింతపండును కూడా వేయండి.. చింతపండుకు బదులుగా నిమ్మరసాన్ని కూడా వాడవచ్చు. ఈ చింతపండు మునిగేంతవరకు నీళ్లు పోయాలి. దీనిలో ఐదు లేదా ఆరు లవంగాలను, అలాగే రెండు మూడు ముక్కలుగా తుంచి తమలపాకులను వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు నానబెట్టాలి.

ఇప్పుడు, శుభ్రం చేసి పెట్టుకున్న గోరింటాకు ఆకులను మిక్సీ జార్లో వేయాలి. ముందుగా నానబెట్టిన వక్క, చింతపండు (లేదా నిమ్మరసం), లవంగాలు, తమలపాకుల నీటితో సహా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కు మూత పెట్టి, అర గంట నుండి ఒక గంట పాటు పక్కన ఉంచితే రంగు బాగా పడుతుంది. ఈ పేస్ట్ తో మీకు నచ్చిన డిజైన్లను వేసుకోవచ్చు. గోరింటాకు కేవలం ఆడవారే పెట్టుకోవాలనేది అపోహ మాత్రమే.. మగవారు కూడా పెట్టుకోవచ్చు.

గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆషాడమాసం వర్షాలు ప్రారంభమయ్యే సమయం కాబట్టి, రకరకాల వ్యాధులు, అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. గోరింటాకుకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వలన వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు శరీరంలోని వేడిని నియంత్రించి సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువస్తుంది.

ఇది గోళ్లను పెళుసుబారకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చిపోయిన గోళ్లకు ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించడంలో గోరింటాకు చాలా సహాయపడుతుంది. వర్షకాలంలో మహిళలు ఎక్కువ సమయం నీటిలో పనిచేయడం వల్ల కాళ్లకు పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. గోరింటాకును కాళ్లకు పెట్టుకోవడం వల్ల పగుళ్లు రాకుండా నివారిస్తుంది. స్త్రీల అరచేతుల మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట.. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయి.

చర్మంపై వచ్చే అలర్జీలను తగ్గించడానికి, అలాగే ఎక్కువసేపు నీటిలో ఉండడం వల్ల వచ్చే పుండ్లు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ గోరింటాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరంలో వేడి వలన వచ్చే గడ్డలను కూడా ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా, గోరింటాకును హెయిర్ ప్యాక్ గా వేసుకోవడం వలన జుట్టు బలంగా పెరుగుతుంది. గోరింటాకు తీసిన వెంటనే చేతులను కడగకుండా కొబ్బరి నూనె రాసుకుంటే మంచి ఎర్రటి రంగు వస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us