Health Tips: నాన్-వెజ్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్‌ఫుడ్స్‌ తింటే.. పుష్కలమైన ప్రోటీన్ మీ సొంతం!

మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాంటే మనకు ప్రోటీన్ ఎంతో అవసరం. చాలా మంది ప్రోటీన్ కోసం చికెన్ లేదా గుడ్లు తినాలని అనుకుంటారు. కానీ శాఖాహారుల విషయానికి వస్తే పోటీన్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ఆయోమయంలో పడిపోతారు. అలాంటి వారి కోసమే కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకొచ్చాం. ఈ ఫుడ్స్‌ తింటే మీకు నాన్‌వెజ్ అవసరం లేకుండానే మన శరీరానికి అసవమైన ప్రోటిన్ లభిస్తుంది. కాబట్టి ఆ సూపర్ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం పదండి.

Health Tips: నాన్-వెజ్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్‌ఫుడ్స్‌ తింటే.. పుష్కలమైన ప్రోటీన్ మీ సొంతం!
Boost Protein Intake

Updated on: Feb 08, 2026 | 1:26 PM

ప్రోటీన్ అనేది మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది శరీర కణాలు, కణజాలాలను నిర్మించడానికి మరమ్మత్తు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ అనేది ఎముకలను బలోపేతం చేయడంతో పాటు మనకు కవాలసిన శక్తిని అందిస్తుంది. చాలా మంది మాంసం లేదా గుడ్లు లేదా పాలు వంటి ఆహారాలలో మాత్రమే ప్రోటీన్ లభిస్తుందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. మన ఇళ్లలో లభించే చిన్న చిన్న విత్తనాల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాలలో కొన్ని ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటాయి, వాటిలో ప్రోటీన్ కంటెంట్ గుడ్డుతో ఉన్న ప్రోటీన్‌కు సమానంగా ఉంటుంది. ఒక గుడ్డులో దాదాపు 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి గుడ్డుతో సమానంగా మీ శరీరానికి ప్రోటిన్ అందించే ఆహార పదార్ధాలు ఏవో చూద్దాం.

జనపనార గింజలు: ఇవి చూడటానికి చిన్నగా ఉండవచ్చు, కానీ అవి పోషకాలతో నిండి ఉంటాయి. కేవలం 3 టేబుల్ స్పూన్ల జనపనార గింజలు సుమారు 10 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి. వాటిలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి, ఇవి వాటిని పూర్తి ప్రోటీన్‌గా చేస్తాయి. వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం కూడా ఉంటాయి. సలాడ్‌లు, సూప్‌లు, స్మూతీలు లేదా ఓట్‌మీల్‌ ఇలా దేనిపైనైనా వీటిని గార్నీష్‌గా వేసుకొని మనం ఆహారంగా తీసుకోవచ్చు.

గుమ్మడికాయ గింజలు: వీటినే కడ్డుకా బీజ్ అని కూడా పిలుస్తారు. గుమ్మడికాయ గింజలు మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. 28 గ్రాముల గుమ్మడికాయ గింజలలో సుమారు 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే వీటిలో మెగ్నీషియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని మీరు ఈవినింగ్ స్నాక్‌గా తినవచ్చు లేదా సలాడ్‌లు, సూప్‌లపై కూడా గార్నిష్‌గా యాడ్ చేసి తీసుకోవచ్చు.

పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలు ఇవి కూడా ఆరోగ్యకరమైన స్నాక్‌కు ఉత్తమ ఎంపిక. 28 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వాటిలో విటమిన్ E, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. మీరు వాటిని పచ్చిగా లేదా లైట్‌గా కాల్చి తినవచ్చు. మీరు షాకాహారులై మీ ఆహారంలో ప్రోటీన్ పెంచుకోవాలనుకుంటే ఈ విత్తనాలు మీకు మంచి ఎంపిక.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.