గుండె జబ్బులు ఉన్న వారు తీపి పదార్థాలు తినొచ్చా..? అప్పుడప్పుడు తింటే ఏమవుతుంది..

ఉరుకులు పరుగుల జీవితం.. ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.. అయితే.. ముఖ్యంగా తీపి పదార్థాలు అనారోగ్య సమస్యలను పెంచుతున్నాయి. వాస్తవానికి ఎక్కువ చక్కెర తినడం ఎవరికైనా చాలా హానికరం. స్వీట్లు తినడం వల్ల బరువు పెరగడం, డిప్రెషన్, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

గుండె జబ్బులు ఉన్న వారు తీపి పదార్థాలు తినొచ్చా..? అప్పుడప్పుడు తింటే ఏమవుతుంది..
ఎండుద్రాక్షను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నానబెట్టిన ఎండుద్రాక్షను తినడంతోపాటు.. ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని తాగడం ద్వారా కూడా మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. రోజూ 4-10 ఎండు ద్రాక్షలు తినాలి. అయితే ఎండుద్రాక్షలో చక్కెరలు ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Updated on: Apr 21, 2024 | 8:16 PM

ఉరుకులు పరుగుల జీవితం.. ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.. అయితే.. ముఖ్యంగా తీపి పదార్థాలు అనారోగ్య సమస్యలను పెంచుతున్నాయి. వాస్తవానికి ఎక్కువ చక్కెర తినడం ఎవరికైనా చాలా హానికరం. స్వీట్లు తినడం వల్ల బరువు పెరగడం, డిప్రెషన్, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే, హార్ట్ పేషెంట్ (హృదయ రోగులు) స్వీట్లు తినాలా అనే ప్రశ్న తరచూ తలెత్తుతుంది.. హార్ట్ పేషెంట్ తీపి పదార్థాలు తినొచ్చో లేదో ఇప్పుడు తెలుసుకోండి..

వాస్తవానికి గుండె రోగి రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల స్వీట్లు తినడం వల్ల ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మిఠాయిలు ఎక్కువగా తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరుగుతుంది. ఇది ఒక రకమైన కొవ్వు పదార్థం.. ఇది గుండే సమస్యను మరింత పెంచుతుంది.

అధిక మొత్తంలో చక్కెర ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల హై బీపీ రిస్క్ పెరుగుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో సోడియం – పొటాషియం సహజ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది హార్ట్ రిస్క్ ను మరింత పెంచుతుంది.

తీపి పదార్థాలు – పానీయాలు శరీరంలో కేలరీలను చాలా పెంచుతాయి. దీని కారణంగా పోషకాల లోపం మొదలవుతుంది. ఒక వ్యక్తి ప్రతిరోజూ స్వీట్లు తింటుంటే, అలాంటి వారు బరువు పెరుగుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బరువు పెరగడం అనేది ఒక వ్యాధి కాదు కానీ దాని కారణంగా అనేక ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. గుండెపోటుకు అనేక కారణాలలో ఒకటి బరువు పెరగడం..

హృద్రోగులు, స్వీట్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని.. పేర్కొంటున్నారు. కావున సాధ్యమైనతంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మితంగా తింటే పర్వాలేదు కానీ.. ఎక్కువగా తింటే హాని తప్పదని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..