వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!

సాధారణంగా ప్రతి ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం టీ తాగుతారు. అయితే, ఆ తర్వాత వాడిన టీపొడిని ఎలాంటి ఉపయోగం లేదని పారేస్తుంటారు. అయితే, వాడిన టీపొడితో చాలా ఉపయోగాలున్నాయి. ఇవి తెలుసుకుంటే మీరు ఈ టీపొడిని అసలు బయట పడేయరు.

వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
Tea Powder

Updated on: Jan 11, 2026 | 7:49 PM

ప్రతి ఇంట్లో రోజూ ఉదయం సాయంత్రం టీ తాగడం సాధారణమే. కానీ, టీ తాగిన తర్వాత మిగిలిపోయే ‘వాడిన టీపొడి (టీ ఆకులు)’ని చాలామంది ఉపయోగం లేకపోయిందని భావించి వెంటనే చెత్తలో పడేస్తుంటారు. అయితే, ఈ వాడిన టీపొడిలో అనేక అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఇంటి పనుల నుంచి తోటపని, చర్మ సంరక్షణ వరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.

ఇంటి పనుల్లో వాడిన టీపొడి ఉపయోగాలు

సహజ క్లీనర్‌గా
వాడిన టీపొడిని ఆరబెట్టి, పాత్రలు లేదా కిచెన్ సింక్ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే కొవ్వు మరకలు సులభంగా తొలగిపోతాయి.

దుర్వాసన తొలగించడానికి
ఫ్రిజ్, షూ ర్యాక్ లేదా డస్ట్‌బిన్ దగ్గర ఎండబెట్టిన టీపొడి ఉంచితే దుర్వాసనను పీల్చుకుని గది తాజాగా ఉంటుంది.

తోట పనులకు టీపొడి వరం

మొక్కలకు ఎరువుగా
వాడిన టీపొడిని మట్టిలో కలిపితే నేల సారవంతంగా మారి మొక్కల పెరుగుదల మెరుగవుతుంది. పూ మొక్కలు ఇది బాగా ఉపయోగపడుతుంది. టీ పొడిలో పాలు, చక్కెర మిగలకుండా నీటితో కడిగి ఎండబెట్టాలి. ఆ తర్వాత నేరుగా మట్టిలో కలిపితే మొక్కలు ఎరువుగా ఉపయోగపడుతుంది. అంతేగకా, కీటకాలను దూరంగా ఉంచేందుకు చెట్లు, కుండీల దగ్గర టీపొడి చల్లితే కొన్ని రకాల కీటకాలు దరిచేరవని తోట నిపుణులు చెబుతున్నారు.

అందం, ఆరోగ్య సంరక్షణలో వాడిన టీపొడి
కళ్ల అలసట తగ్గించేందుకు.. చల్లారిన టీపొడి ప్యాకెట్లను కళ్లపై ఉంచితే అలసట, వాపు తగ్గుతుందని చాలామంది అనుభవపూర్వకంగా చెబుతున్నారు.ఇక, టీపొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి.

పర్యావరణానికి ప్రయోజనం.. వాడిన టీపొడిని మళ్లీ ఉపయోగించడం ద్వారా చెత్త పరిమాణం తగ్గుతుంది. ఇది పర్యావరణ పరిరక్షణకు చిన్నదే కానీ ముఖ్యమైన అడుగు అని నిపుణులు అంటున్నారు.

అయితే, టీపొడిని మళ్లీ ఉపయోగించే ముందు తప్పకుండా పూర్తిగా ఆరబెట్టాలి. తేమ ఉంటే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చర్మంపై వాడేటప్పుడు అలెర్జీ ఉంటే జాగ్రత్త అవసరం. ఇప్పటివరకు వాడిన టీపొడిని నిరుపయోగంగా భావించి పారేసేవారు, ఇకపై దాని ఉపయోగాలు గుర్తుపెట్టుకుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి, ఇక నుంచి టీ తాగిన తర్వాత టీపొడిని చెత్తలో వేయడానికి ముందు మరోసారి ఆలోచించండి.